డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

Purushottham Vinay
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకుంటుందని భావించిన రాధేశ్యామ్ సినిమా చాలా తీవ్రంగా ఫ్యాన్స్ ని నిరాశ పర్చింది.ఇక యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన రాధేశ్యామ్ సినిమా సక్సెస్ అయితే వెంటనే మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో రెబల్ స్టార్ ప్రభాస్ నుండి కొత్త సినిమా ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.ఇక కేవలం రెండు నెలల్లోనే ఒక సినిమాను పూర్తి చేసేందుకు  ఒక స్క్రిప్ట్ ను కూడా ఇప్పటికే ప్రభాస్ కోసం రెడీ చేశాడు మారుతి.ఇక ఆ సినిమా పేరే రాజా డీలక్స్. టైటిల్ విషయంలో కాస్త తర్జన బర్జనాలు జరుగుతున్నా కానీ సినిమా మాత్రం పక్కాగా స్టార్ట్ కాబోతుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని రాధేశ్యామ్ సినిమా ఫలితంతో ప్రభాస్ నిర్ణయం మార్చుకున్నాడనే పుకార్లు కూడా షికార్లు చేయడం మొదలు అయ్యింది.రాజా డీలక్స్ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.


ఈ సమయంలోనే మారుతి సన్నిహిత వర్గం నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం మారుతి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.పక్కా కమర్షియల్ సినిమా విడుదల అయిన తరువాత వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న ఈ సినిమా విడుదల కూడా మరీ ఆలస్యం కాకుండా ఇదే ఏడాది చివర్లో వస్తుందని అంటున్నారు. ప్రభాస్ చిన్న సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది చివర్లోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి ఆ చిన్న సినిమా రాబోతుందనే వార్తలు ఆయన ఫ్యాన్స్ కి ఖచ్చితంగా ఎగ్జైటింగ్ గా అనిపిస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయంని వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లో షూట్ చేసినా కూడా మరీ లో బడ్జెట్ తో కాకుండా భారీగానే ఖర్చు పెట్టబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి పండుగకి చాలా సినిమాలు ఉన్న కారణంగా ఇదే సంవత్సరం డిసెంబర్ లో రాజా డీలక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: