రామ్-బోయపాటి శ్రీను సినిమా పక్కా ఊర మాస్ హిట్టవ్వడం ఖాయమట!

Purushottham Vinay
ఇప్పుడు ప్రతీ డైరెక్టర్ ఇంకా అలాగే ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. క్రేజ్  ఇంకా ఇమేజ్ తో అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఒక్కసారిగా తమ మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తున్నారు.ఇక ఈ మేరకు ఇప్పటికే కొంతమంది బాగా సక్సెస్ అవ్వగా.. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంకా అలాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారు.ఊర మాస్ యాక్షన్ సినిమాలతో దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించి మిలియన్ల వ్యూస్ రాబడుతుంటాయి. 


'అఖండ' సినిమాతో ఊర మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఇందులో భాగంగానే ముందుగా పోతినేని రామ్ తో ఓ భారీ మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేశారు.హిందీ డబ్బింగ్ సినిమాలతో ఉస్తాద్ రామ్ నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. అతని ప్రతీ సినిమా కూడా హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. దీంతో నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు హీరో రామ్ మంచి హాట్ షాట్ ఫేవరెట్ గా మారిపోయాడు.ఇక ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీనుతో కలిసి భారీ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది.ఇక ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రామ్ ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: