మరోసారి గొప్ప మనసు చాటుకున్న సూర్య.. వాళ్ళకి ఉచితంగా ఇళ్ళు..!

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈయనకి రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా కోలీవుడ్ లో సూర్యకు మంచి పేరు ఉంది.ఇకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా సూర్య ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. అయితే అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నాడు. ఇదిలావుండగా  తాజాగా మరోసారి సూర్య తన ఉదారమనసు చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో .. దర్శకుడు బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అయితే సూర్య కెరీర్‌లో 41వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో..

 సూర్య ఒక జాలరిగా కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. కాగా చెన్నైలోని ఒక ప్రాంతంలో కొన్ని గుడిసెలతో ఒక గ్రామాన్ని నిర్మించబోతున్నారట మేకర్స్. అయితే భారీ ఖర్చుతో వేస్తున్న ఈ గుడిసెలను షూటింగ్ తరువాత తీసివేయకుండా చెన్నైలో ఇళ్లు లేని మత్య్యకారులకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా మత్స్యకారుడి పాత్ర కోసం వారి జీవితాన్ని దగ్గరనుంచి చుసిన సూర్య ఉండడానికి వారికి ఇల్లు కూడా లేకపోవడంతో చలించిపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చిత్ర బృందం తెలుపుతోంది. 

అయితే ఏదిఏమైనా సూర్య చేసిన పనికి ఆయన అభిమానులే కాకుండా ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు. కాగా  ఈ సినిమాలో సూర్య సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది.ఈ సినిమాకి గాను కృతి శెట్టి భారీ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారంఇదిలావుండగా సూర్య – బాలా కాంబో అనగానే 'నందా', 'పితామహన్‌' చిత్రాలు టక్కున గుర్తుకు వస్తాయి.అంతేకాదు  సూర్య కెరీర్ బెస్ట్ సినిమాలు అంటే అవేనని చెప్పొచ్చు.అయితే మరి ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: