బీస్ట్ సినిమా లో ఆ తప్పు వల్లే ఇలా జరిగిందా..!!

Divya
విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13వ తేదీన థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఇక అంతే కాకుండా విజయ్ కున్న క్రేజ్ తో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ ఊహించారు. అయితే ఈ చిత్రం కాస్త డీలా పడినట్లు గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది వరకు విడుదలైన చిత్రాలు అన్ని విజయ్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది.
ఇక తమిళనాడులో అయితే విజయ్ కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఆయన అభిమానులు విజయ్ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి బీస్ట్ చిత్రం మాత్రం అక్కడ వారిని నిరాశపరిచిన ట్లుగా సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ వారు మాత్రం ఎక్కడ ఈ సినిమాకి రాజీపడలేదు. అలాగే ఖర్చు విషయంలో కూడా వెనుకడుగు వేయలేదు. ఈ చిత్రం కథ మొత్తం ఒక మాల్ చుట్టూ తిరిగి నప్పటికీ చాలా రిచ్ గా కనిపించే విధంగానే ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకి ముందు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కేవలం రెండు చిత్రాలను మాత్రమే తీయడం జరిగింది. అందులో నయనతారతో ఒకటి మరొకటి శివకార్తికేయన్ తో ఒకటీ. ఈ చిత్రాలు రెండు వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి కారణం ఏమిటంటే ఈ సినిమా ప్రారంభంలోనే హీరోహీరోయిన్లు మాల్ లో  ఉండిపోవడం ఆడియన్స్ కు ఆశించిన స్థాయిలో రొమాన్స్ పాటలను తీయ లేకపోవడం, యోగి బాబు నుంచి కామెడీ ఉంటుంది అనుకోవడం.. కానీ అతను కూడా నామమాత్రంగానే ఈ సినిమాలో ఉండడంతో ఈ సినిమాకి మైనస్ గా మారాయి. ఇక అంతే కాకుండా విలనిజం లో కూడా సరిగా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: