జబర్దస్త్ నుంచి రోజా ఔట్.. ఆమెకు లక్కీ ఛాన్స్?

praveen
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒక సాదా సీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ కార్యక్రమం ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ కామెడీ షో గా సాగుతోంది. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కార్యక్రమం.
 అయితే జబర్దస్త్ కార్యక్రమం పేరు ఎత్తగానే అందరికీ గుర్తుకు వచ్చేది సరికొత్త కామెడీ. ఇక అంతే కాకుండా అటు జడ్జ్ రోజా నవ్వులు కూడా గుర్తుకు వస్తాయి. ఎందుకంటే జబర్దస్త్ మొదలైన నాటి నుంచి జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతున్న రోజా ఇక తన నవ్వులతో కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోజాకి మంత్రి పదవి దక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకనుంచి షూటింగ్లకు వివిధ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను అంటూ చెప్పింది. ఇక జబర్దస్త్ దూరం కాబోతున్నా అంటూ ఏకంగా రోజా కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియోని ఇటీవలే విడుదల చేసారు.

 దీంతో ఎంతో మంది జబర్దస్త్ అభిమానులు  రోజా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అవ్వబోతుంది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే రోజా దూరం కావడంతో రోజా  జడ్జీ స్థానంలో ఒకరు లక్కీ ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉంది. ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసేది ఎవరో కాదు ఇంద్రజ. గత కొంతకాలం నుంచి జబర్దస్త్ సహా ఈటీవీ లో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో జడ్జిగా వస్తుంది ఇంద్రజ.. నవ్వులతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఒక సమయంలో రోజా వద్దు ఇంద్రజ కావాలి అంటూ కామెంట్ లతో రెచ్చిపోయారు నెటిజన్లు. ఇక ఇప్పుడు రోజా వెళ్లిపోవడంతో ఇంద్ర జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇంద్రజ అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: