మహేష్ సినిమా పూర్తి కానీ ఒక్కటి తప్పా...!!

murali krishna
సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ బాబు నుండీ రాబోతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని 'మైత్రి మూవీ మేకర్స్' '14 రీల్స్ ప్లస్' సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయట.
మహేష్ బాబు  సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు రెండు పాటలకి ప్రేక్షకుల నుండీ అదిరిపోయే రెస్పాన్స్ లభించిందట.గ్లింప్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందట..
ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్.. 'పోకిరి' రోజులను గుర్తు చేస్తుండడంతో… అభిమానులకి మంచి ఫీస్ట్ గ్యారెంటీ అని అందరు అనుకుంటున్నారు. ఇక 'సర్కారు వారి పాట' షూటింగ్ విషయానికి వస్తే.. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యిందని సమాచారం.త్వరలోనే పాట చిత్రీకరణ కూడా పూర్తి చేసి ప్రమోషన్లను మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోందట.. మే 12 న ఈ చిత్రం విడుదల కాబోతుందని . అంటే ఈరోజుకి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉందని తెలుస్తుంది.
 
నిజానికి కరోనా ఇబ్బందులు వంటివి లేకుండా ఉంటే 'సర్కారు వారి పాట' ని సంక్రాంతి కానుకగానే విడుదల చేద్దాం అనుకున్నారట మేకర్స్. ఇక బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ రోల్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటుందట. దర్శకుడు పరశురామ్ మహేష్ పాత్రని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ సమాచారం.. అంతేకాకుండా ఈ మూవీలో పాన్ ఇండియా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా మూవీని మాత్రం కేవలం తెలుగులోనే విడుదల చేస్తుండడం… డిజప్పాయింట్ చేసే అంశం అని కూడా వారందరూ చెబుతున్నారు. మరి మాటల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా… కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కళావతి పాత్రలో ఆమె కనిపించనుందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: