రేణు దేశాయ్ మాటల పై పవన్ అభిమానుల సందేహాలు !

Seetha Sailaja
రేణు దేశాయ్ ని ఇప్పటికీ పవన్ అభిమానులు తమ సొంత కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటారు. అందువల్లనే ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే చాలు క్షణాలలో వైరల్ గా మారిపోతాయి. ఈమధ్య అకిరా నందన్ పుట్టినరోజు హడావిడి నేపధ్యంలో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పై పవన్ అభిమానులలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అకిరా నందన్ కు హీరో అయ్యే ఉద్దేశ్యం లేదని అతడి ఆలోచనలు వేరని చెపుతూ రేణు దేశాయ్ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో అకిరా నందన్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు మాత్రం తాము రేణు దేశాయ్ అభిప్రాయాన్ని పూర్తిగా నమ్మలేమని అకిరా హీరో కావడం కోసమే ఇలా రకరకాల శిక్షణలు తీసుకుంటున్నాడు అంటూ పవన్ అభిమానులు వాదిస్తున్నారు.

ప్రస్తుతం అకిరా తన సోదరి ఆద్య తో కలిసి పవన్ దగ్గర ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ భార్య అన్నా ఆమె పిల్లలు సింగపూర్ లో ఉంటున్న నేపధ్యంలో పవన్ కు పెద్ద కొడుకుగా అకిరా అతడికి అన్నివిధాల సహకరిస్తున్నాడు అంటూ వార్తలు కూడ వచ్చాయి. అకిరా సోదరి ఆద్య కూడ పవన్ ఇంటిలోనే ఉంటోంది. ఒకవైపు బాక్సింగ్ గుర్రపుస్వారీ నేర్చుకుంటూ అకిరా హైదరాబాద్ లోని ఒక ప్రముఖ విద్యా సంస్థలో చదువుకుంటున్నట్లు టాక్.

దీనితో అకిరా ఒక వైపు చదువుకుంటూనే నటనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అవగాహన ఏర్పరుచుకునేలా పవన్ చాల ముందు చూపుతో ఇప్పటి నుంచే అకిరా కు అన్నీ అలవాటు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ మాత్రం అకిరా నందన్ కు నటనపట్ల అభిరుచి లేదు అంటూ చేసిన కామెంట్స్ ఎంతవరకు వాస్తవం అన్న సందేహాల మధ్య ప్రస్తుతం పవన్ అభిమానుఉలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ పూర్తిగా రాజకీయాలలోకి వెళ్ళిపోతే అకిరా నందన్ మారాలని పవన్ అభిమానులు మనసారా కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: