పండగ రోజు సర్ప్రైజ్ ఇచ్చిన సితార.. ఆనందంలో మహేష్ బాబు..!

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ విషయాలతోపాటు చిన్నపిల్లల ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ చాలా మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది సితార. తన తండ్రిని మించి తనకంటూ సోషల్ మీడియాలో ఒక సపరేట్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక ఇన్నాళ్లూ సితార వెస్టర్న్ డాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీ రామనవమి పండుగ సందర్భంగా తొలిసారి కూచిపూడి డాన్స్ చేసింది సితార. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.." ఇది నా మొదటి కూచిపూడి నాట్య పఠనం. నా గురువులు అరుణా భిక్షు మరియు మహాతీ దీక్ష వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. డివిఎస్ శాస్త్రి సంగీతాన్ని అందించారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీరాముడి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి అందరికీ చేకూరాలని కోరుకుంటున్నాను.." అంటూ ఒక నోట్ ని రాసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఇదే వీడియో ను సితార తండ్రి మహేష్ బాబు షేర్ చేస్తూ.." సితార మొదటి కూచిపూడి డాన్స్ ఇది. పవిత్ర శ్రీరామనవమి రోజున ఈ నృత్య ప్రదర్శనను మీకు చూపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

రాముడి గొప్పతనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.." అని సితార వీడియో ని షేర్ చేయడం తో పాటు తన కూతురికి కూచిపూడి డాన్స్ నేర్పించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు మహేష్ బాబు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో చూసిన కొందరు సితార పాప కూచిపూడి డాన్స్ అదిరిపోయింది అని కొంతమంది కామెంట్ చేయగా మరికొంతమంది తండ్రికి తగ్గ తనయురాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తు వైరల్ చేస్తున్నారు. ఇక మరోవైపు సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సితార పెన్ని అనే సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: