యాంకర్ సుమ అందరికి పంచ్‌లు వేస్తుంది. షాక్‌ల మీద షాక్‌లిస్తూ ఎన్నో నవ్వులు పూయిస్తుంది. కానీ ఈ సారి ఆమె జబర్దస్త్ కమెడీయన్లకి దొరికిపోయింది పాపం. దీంతో `జబర్దస్త్` వేదికగా యాంకర్ సుమ అసలు రూపం బయటపెట్టేశారట.
సుమ కనకాల.. టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత కాస్ట్లీ యాంకర్ కూడా తనే. స్టార్ హీరోయిన్ల కంటే కూడా ఎంతో బిజీగా ఉంటారు. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సినిమా ప్రోగ్రాములు, ఇంకో వైపు సెలబ్రిటీల స్పెషల్ ఇంటర్వ్యూలు, మరోవైపు యూట్యూబ్ ఛానెల్ వీడియోలు, ఇంకోవైపు కొత్తగా సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇలా నాలుగు చేతులా సంపాదిస్తుంది సుమ కనకాల.
`క్యాష్`, `స్టార్ట్ మ్యూజిక్` వంటి షోలకు యాంకర్‌గా చేస్తున్న సుమ.. ఫస్ట్ టైమ్ అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తున్న `జబర్దస్త్` షోలో మెరిసిందట.స్టేజ్‌పై స్కిట్లు వేయడంతోపాటు జడ్జ్ గా కూడా వ్యవహరించింది. అందరికి నవ్వులు పూయించింది. అలరించింది. తనలోని కొత్త యాంగిల్స్ ని కూడా ఆవిష్కరించింది. `జబర్దస్త్` షోకి కొత్త కళని, సరికొత్త ఎనర్జీని కూడా తీసుకొచ్చింది. సుమ నటిగా మారి `జయమ్మ పంచాయితీ` చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా విడుదలకు కూడా సిద్ధమవుతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా `జబర్దస్త్`షోలో మెరిసిందట సుమ.
ఇందులో కాసేపు ఆమె కమెడియన్‌గా వ్యవహరించింది. ఇతర ఆర్టిస్టులతో కలిసి పంచ్‌లు కుడా వేసి నవ్వులు పూయించింది. మరోవైపు జడ్జ్ గానూ తనదైన పంచ్‌లతో రెచ్చిపోయింది. మరోవైపు `జబర్దస్త్` షోలోని అందరి స్కిట్లు సుమ మీదనే ఉండటం గమనార్హం.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆమెపై పంచ్‌లు, సెటైర్లు వేస్తూ ఎంతో కామెడీ పంచారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాగుబోతు రమేష్ మాత్రం యాంకర్ సుమలా మారిపోయాడట.. ఆమెలా చీరకట్టి రెడీ అయ్యారు. తాను హోస్ట్ గా చేసే షోలో సుమ ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్టు అందరికి చూపించారు. ఆమె అసలు రూపం బయటపెట్టాడు.
అయితే తాగుబోతు రమేష్.. తన గెటప్ వేసుకుని వస్తుంటూనే జడుసుకుందట సుమ. ఆయన్ని చూసి సీట్లో నుంచి లేచి వెళ్లిపోయేందుకు కూడా ప్రయత్నించింది. పక్కనే ఉన్న జడ్జ్ లు మనో, రోజా లు సముదాయించి కూర్చోబెట్టారట. ఆ తర్వాత తాగుబోతు రమేష్ మరింత రెచ్చిపోయాడు.
సుమ షో చేసేటప్పుడు మేకప్ ఎలా వేసుకుంటుందో, ఎంతగా వేసుకుంటుందో కూడా చూపించారు. అంతేకాదు మేకప్ తీస్తే గుర్తుపట్టలేవని, ఒకేసారి చూస్తే భయపడతావని తెలిపాడు. `క్యాష్` ప్రోగ్రామ్‌లో ఆమె ఎలా వ్యవహరిస్తుందో కూడా చూపించారు. ఆమో నిద్రలో కూడా క్యాష్ ప్రోగ్రామ్ని కలవరిస్తుండటం కూడా చూపించాడు. సుమ అంటే జోక్సే కాదు, అప్పుడప్పుడు సీరియస్ కూడా అవుతుందని, ఇది ప్రోమోగా కట్ చేసుకోండి అంటూ పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడట.తాగుబోతు రమేష్. ఈ స్కిట్ ఆద్యంతం కూడా నవ్వులు పూయించింది.