బంగారు మనసు ఛాటుకున్న చరణ్..గ్రేట్..

Satvika
రామ్ చరణ్..ఈ పేరు ఇప్పుడు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరో అయ్యాడు. జక్కన్న చరణ్ కోసం చాలా కష్టపడ్డాడు. దాని ఫలితం ఇప్పుడు చరణ్ ను ఈ స్థాయి లో ఉంచింది. ఒకప్పుడు తిట్టిన అందరూ కూడా ఇప్పుడు అతణ్ణి ఆకాశానికి ఎత్తి వేస్తున్నారు. అతని నటన చాలా బాగుందని, చెర్రి ఇలాంటి సినిమాలను తీస్తూ జనాలకు ఇలానే దగ్గర కావాలని అభిప్రాయ పడుతున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంత ఘన విజయాన్ని అందుకుంది.. అందులో హీరో ల పాత్ర తో పాటు సినిమా కోసం చాలా మంది పని చేసిన అందరూ కూడా కష్టపడ్డారు.


బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వారం రోజుల్లోనే మంచి కలెక్షన్స్ ను అందుకుంది. సినిమాకు అయ్యింది 300 కోట్లు. వారం లో సినిమా కు వచ్చింది మాత్రం 750 కోట్లు.. ఇప్పటికీ సినిమా పై క్రేజ్ కొనసాగుతుంది.. సినిమను చూసెందుకు జనం ఎగబడుతున్నారు... ఇది మంచి విషయం అనే చెప్పాలి.


కాగా, రామ్ చరణ్ మంచి మనసును ఛాటుకున్నారు.సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల నుంచి పని చేసిన 35 మందిని చరణ్ డిన్నర్ కోసం ఇంటికి పిలిచాడు.అందరు తిన్న తర్వాత వారందరి తో కూర్చొని ముచ్చటించారు. సినిమా సక్సెస్ గురించి అందరితో చాలా సేపు మాట్లాడారు.వారందరికీ ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడడంతో పాటుగా ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని చెర్రి అన్నారు. ఇలా అందరినీ పిలిచి వారికి కడుపు నిండా అన్నం పెట్టడం తో పాటు బంగారు బహుమతులు ఇవ్వడం చరణ్ కె సాధ్యం.. ఇకపొతె చరణ్ ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుస సినిమా లను చేసే పనిలో బిజిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: