సమంతకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నయనతారా...!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత వరుస సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి అందరికి షాకిచ్చింది. ఈ పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.అలానే తమిళంలో 'కాతు వాక్కుల రెండు కాదల్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. 'కణ్మణి రాంబో ఖతీజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది చిత్రబృందం. దీంతో అందరూ కలిసి చిన్న పార్టీ చేసుకున్నారట.. సెట్ లో కేక్స్ కూడా కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అయితే బాగా వైరల్ అయ్యాయి. ఇక నయనతార.. సమంతకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిందని తెలుస్తుంది.. నయన్.. సమంతకు డైమండ్ ఇయర్ రింగ్స్ ఇచ్చిందట.. వీటితో పాటు ఓ థాంక్యూ నోట్ ని కూడా షేర్ చేసిందట సమంత.

 

దానిపై 'డియర్ ఖతీజా.. విత్ లవ్ కణ్మణి' అని రాసుందట.. సినిమాలో క్యారెక్టర్ పేర్లతో థాంక్యూ నోట్ రాసిందట నయనతార. దీన్ని షేర్ చేస్తూ.. 'థాంక్యూ డార్లింగ్ నయన్' అని సమంత తిరిగి రాసుకొచ్చింది. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన విషయం తెలిసిందే.. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాను రూపొందించారట..

 గతంలో ఇతడు డైరెక్ట్ చేసిన 'నానుమ్ రౌడీథాన్' సినిమా మంచి హిట్ అవ్వడంతో దీనిపై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి. పైగా స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది.. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: