రాజమౌళి సెంటిమెంట్ కు వీరు బలవ్వక తప్పదా..!!

P.Nishanth Kumar
రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక హీరోకి ఉంటుంది. అంతవరకు ఇది అందరినీ ఎంతగానో మెప్పించే విషయమే అయినా ఆ తర్వాత ఎదురయ్యే విషయాలకు మాత్రం కొంత మంది హీరోలు ఎంతగానో భయపడుతున్నారు. రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోల కెరీర్ ను పరిశీలిస్తే జక్కన్న సినిమా తర్వాత హీరోలు కోలుకోలేక పోతున్నారు అని చెప్పాలి.  ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్అర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనతో సినిమా చేయాలని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఈ సినిమా యొక్క హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతగానో టెన్షన్ పడుతున్నారట.

ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ భారీ విజయాన్ని అందుకోగా ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన సుబ్బు సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా,  యమ దొంగ తర్వాత చేసిన కంత్రి సినిమా ప్లాప్ అయింది.  ప్రభాస్ తో ఛత్రపతి సినిమా చేయగా ఆ తరువాత మరొక విజయాన్ని అందుకోవడానికి ఆ హీరోకు చాలా సమయమే పట్టింది. బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచాయి. ఆ విధంగా రామ్ చరణ్ తో మగధీర సినిమా చేయగా ఆ తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఈ లెక్కన జక్కన్న సినిమా చేస్తే సదరు హీరోల తదుపరి సినిమాలు ఫ్లాప్ అవుతాయి అన్న ఆలోచన హీరోల అభిమానులను ఎంతగానో టెన్షన్ పెట్టిస్తుంది.  రాజమౌళి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ తదుపరి సినిమాలు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఉండక పోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తదుపరి సినిమా చేయబోతున్న సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. ఇంకొక వైపు మహేష్ రాజమౌళి సినిమా కోసం ప్రతి ఒక్కరు ఉవ్విళ్లూరుతున్నారు. ఏదేమైనా రాజమౌళి లా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మన తెలుగు సినిమా పరిశ్రమలో లేకపోవడం దురదృష్టకరం. అంతటి స్థాయి ఎలివేషన్ ఇచ్చే దర్శకుడు ఎందుకు రావడం లేదో తెలియట్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: