బ్రేకింగ్ : తస్సాదియ్యా : అక్కడ కింగ్ బాహుబలే ... ఆర్ఆర్ఆర్ కి ఇక అది కలే .... ??

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమా అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ తరువాత వచ్చిన మగధీర కూడా పెద్ద విజయం అందుకుని చాలా ప్రాంతాల్లో మంచి రికార్డులు నెలకొల్పింది. వాటి అనంతరం 2015లో వచ్చిన బాహుబలి, ఆ తరువాత 2017లో వచ్చిన బాహుబలి 2 సినిమాలు రెండూ కూడా భారీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొంది తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసాయి.
దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటించగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. దాదాపుగా అన్ని భాషల్లోని అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందిన ఈ రెండు సినిమాలు కూడా ఒకదానిని మించేలా మరొకటి గొప్ప సక్సెస్ లు అందుకుని మన తెలుగు చిత్ర పరిశ్రమకి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టడం జరిగింది. ఇక బాలీవుడ్ వారి నార్త్ మార్కెట్ లో కూడా బాహుబలి తన విజయ కేతనాన్ని ఎగురవేసింది. కాగా ఇటీవల ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా చాలా వరకు బాహుబలి మూవీస్ రికార్డ్స్ ని బద్దలుకొడుతుందని అందరూ భావించారు.
అయితే తొలిరోజు తొలి ఆట నుండి మిశ్రమ స్పందన అందుకున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో బాగానే కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాహుబలి 2 రికార్డ్స్ ని అందుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. మరీ ముఖ్యగా నార్త్ లో బాహుబలి 2 అయితే ఏకంగా రూ. 510 కోట్ల నెట్ కలెక్షన్ ని దక్కించుకుని ప్రస్తుతం టాప్ స్థానంలో ఉంది. రెండవ స్థానంలో రూ. 189 కోట్లతో 2. 0 మూవీ ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ అయితే ఇప్పటివరకు రూ. 107 కోట్లు దక్కించుకుని ముందుకు నడుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఇక బాహుబలి 2 రికార్డు ని అక్కడ అందుకోవడం చాలావరకు కష్టం అని, పక్కాగా బాహుబలి 2 నే నెంబర్ వన్ స్థానంలో నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు అనలిస్టులు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ రికార్డు ని ఏ సినిమా బద్దలు కొడుతుందో చూడాలి.

South Top hindi Dub/Direct Net Collections : -

1. #Baahubali2: 510Cr
2. #2Point0: 189Cr
3. #Saaho: 150.6Cr
4. #Baahubali: 115Cr
5. #Pushpa: 108.61Cr
6. #RRRMovie: 107.59Cr****
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: