ఆర్ ఆర్ ఆర్ లో మల్లి పాత్రలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ వసూళ్లతో రికార్డు బద్దలు కొట్టింది.ఇక ఈ సినిమాలోని నటనకు ఫిదా అయిపోయాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే  దీంతో ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమాలో చర్చించుకుంటున్నారు ఎవరి గురించో అని మనం అనుకుంటాం... లేకపోతే మనం అందరం అనుకుంటున్నట్లుగా అది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి కాదు. ఇక ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు.  ఈ  సినిమాలో వీరిద్దరు యాక్టింగ్ లో మరో మెట్టు ఎక్కారు అనే చెప్పాలి.

అయితే కానీ ఇప్పుడు చర్చించుకుంటూ ఉంది మాత్రం ఈ ఇద్దరు హీరోల గురించి కాదు అటు హీరోయిన్ ల గురించి కూడా కాదు ....అయితే మరీ ఎవరి గురించి అని అనుకుంటున్నారా. మరెవరో కాదండి త్రిబుల్ ఆర్ సినిమాకు కీలక మలుపుగా మారినా మల్లీ గురించి. ఈ సినిమాలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి గురించి. అయితే చిన్నారి కనిపించేది కొంత సేపు.. కాని ఆ కొంత సమయం లోనే తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.ఇక  తనకు ఉన్నవి చిన్నచిన్న సన్నివేశాలు అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకో గలిగింది. ఇకపోతే నటనకు వయసుతో పని ఏముంది అని నిరూపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఈమె నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు ఆమె ఎవరు బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసు కోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఈ సినిమాలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి పేరు ట్వింకిల్ శర్మ .అయితే ఇక అంతకు ముందు డాన్స్ ఇండియా అనే కాంపిటేషన్లో పాల్గొంది ఈ చిన్నారి.దాని తర్వాత ఈమె  ఇండియాస్ బెస్ట్ డ్రమేబేజ్ షోలో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచి ఎంతో మంది ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయింది. దీనితోపాటు ఈమె హిందీ ఛానల్స్లో ప్రసారమయ్యే ఎన్నో ఈవెంట్స్లో కూడా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు టీవీ షో స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అక్కడితో అయిపోలేదు ఈమె  ఫ్లిప్కార్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రకటనలలో కూడా నటించింది ట్వింకిల్ శర్మ.అయితే  చివరికి రాజమౌళి దృష్టిలో పడింది.ఇక మన  జక్కన్న ఊరుకుంటాడా ఏకంగా త్రిబుల్ ఆర్ సినిమా లో కథ మలుపు తిరిగే ఒక కీలక పాత్ర ఇచ్చేసాడు. అయితే దీంతో ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు గా మారి పోయింది ట్వింకిల్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: