రీఎంట్రీ ఇస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్.. ఆ స్టార్ హీరో సినిమాలో..?

Anilkumar
అలనాటి సీనియర్ నటి హీరోయిన్ లైలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో తన క్యూట్ క్యూట్ మాటలు తన క్యూట్ స్మైల్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది లైలా. ఇప్పటికీ అదే అందం అదే నవ్వుని కొనసాగిస్తూ చెక్కుచెదరని అందంతో అలాగే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో 'ఎగిరే పావురమా' అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది లైలా. ఆ తర్వాత అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి భారీ గుర్తింపును సంపాదించుకుంది. 

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పట్లో లైలా నటించిన సినిమాలలో శివ పుత్రుడు సినిమా ఆమెకు కు కు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. బాలా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్, సూర్య హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది లైలా. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అలనాటి స్టార్ హీరోయిన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోందట లైలా.

అయితే తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ అగ్ర హీరో కార్తి నటిస్తున్న 'సర్దార్' సినిమా లో లైలా ఓ ప్రముఖ పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పిఎస్ మిత్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తీ రెండు డిఫరెంట్ గెటప్స్ తో అలరించబోతున్నాడు? అందులో ఒకటి ఇ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే మరొకటి 60 ఏళ్ళ వృద్ధుడి పాత్ర అని తెలుస్తోంది. మొదటిసారి ఈ సినిమాతో హీరో కార్తి చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి లైలా ఓ కీలక పాత్రలో నటిస్తోందట. అంతేకాదు సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని.. ఆ పాత్ర లైలా కు మంచి పేరు తెస్తుందని కోలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా తర్వాత లైలా కు ఏ మేర అవకాశాలు వస్తాయో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: