నెట్టింట హీరోయిన్ కృతి శెట్టి డాన్స్ వీడియో వైరల్..!!

Divya
ఉప్పెన చిత్రంతోనే ఓవర్ నైట్ లో స్టార్ పొజిషన్లో చేరుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. కేవలం ఈ సినిమా ద్వారానే ఈమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. అభినయం, అదృష్టం ఉండి కెరియర్ బాగా ముందుకు సాగిపోతున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత, రష్మిక వంటివి హీరోయిన్లకు పోటీ ఇస్తూ తన రెమ్యునేషన్ ని పెంచుకుంటూ పోతోంది. అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ని ఒక ఊపు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది.

అయితే నాగచైతన్యతో బంగార్రాజు మూవీ తో మరొక హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. తాజాగా హీరో సుధీర్ బాబు జంటగా" ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి "అనే మూవీ లో కూడా నటిస్తున్నది. మరొక హీరో రామ్ ,లింగుస్వామి డైరెక్షన్ లో వస్తున్న "ది వారియర్ "మూవీలో కూడా ఈమె కథానాయికగా నటిస్తోంది. ఇక హీరో నితిన్ సరసన మరొక సినిమాలో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతుకి సినిమాలోని డాన్స్ ను కృతి శెట్టి వేసింది..  ఈమె సోషల్ మీడియా అందచందాలతో ఒక ఊపు ఊపేసింది అని చెప్పవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ ముద్దుగుమ్మ లో మరొక యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరో విజయ్ పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఈ పాటకి ఎంతోమంది డాన్స్ వేయడం జరిగింది. కేవలం ఈ పాటను నాలుగు రోజులలోనే 100 మిలియన్ వ్యూస్ పెంచుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వేసిన వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: