ప్రయోగం చేయాలి కానీ ఇంత భారీగానా..!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు భారీ రేంజ్ లో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఎవరు అంటే అందరికీ రాజమౌళినే గుర్తుకు వస్తాడు.  ఓ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఆ తర్వాత వెండితెరపై సంచలనం సృష్టించే సినిమాలను చేశాడు. ఎన్టీఆర్ తో ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుంచి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ వరకు ప్రతి ఒక్కటి కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే. ఆ సమయానికి రాజమౌళి చేసిన సినిమాలే భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు.

 అలా ఏమాత్రం తడబడకుండా నీటుగా తను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పి హిట్లు సాధించారు.అలా తొలి సినిమా తో ఆకట్టుకున్న జక్కన్న కు కమర్షియల్ సక్సెస్ వచ్చింది మాత్రం సింహాద్రి సినిమా తోనే అని చెప్పాలి. ఆ తర్వాత చేసిన ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీర సినిమాలు ఆయనకు భారీ చిత్రాలు చేసే దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. మర్యాదరామన్న, ఈగ వంటి చిన్న సినిమాలతో సైతం ఆయన ప్రేక్షకులను అలరించాడు అంటే రాజమౌళి ఎంతటి ఏ స్థాయిలో కథనాలకు విలువ ఇస్తాడు అందరికీ అర్థమవుతుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ చేసిన ఈగ సినిమాతో ఎవరెస్టు స్థాయికి ఎదిగిపోయారు. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ వరకే పరిమితమైపోయిన ఆయన ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ చిత్రం ఆయనకు భారీ ఇమేజ్ ను తీసుకురాగా ఈ సినిమా తో టాప్ దర్శకుడిగా నిలిచిపోయాడు ఇక ఇప్పుడు ఆర్ఆర్ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటూ పోతూ ఉండగా ఈ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అని చెప్పవచ్చు మరి ఆయన తదుపరి సినిమా మహేష్ బాబు తో ఉన్న నేపథ్యంలో ఆ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: