రాజమౌళి తో సినిమా.. హీరోలు కోలుకోలేరా..!!

P.Nishanth Kumar
రాజమౌళితో సినిమా చేయాలని అందరూ కోరుకుంటారు. హీరోలు అయితే తనతో సినిమా చేయమని క్యూలు కడుతున్నారు. కానీ ఆయనతో సినిమాలు చేసిన తర్వాత హీరోలందరూ కూడా ఫీలయ్యేది ఒక విషయం పట్ల. అదేమిటంటే తనకున్న భారీ స్థాయి విజువలైజేషన్ తో రాజమౌళి ఆ హీరోను ఆకాశమంతా ఎత్తులో చూపించి తన సినిమాను హిట్ చేసుకునే విధంగా ముందుకు పోతారు. అలా ఇతర దర్శకులు రాజమౌళి లా ఆలోచించకపోవడం సదరు హీరోలకు మైనస్ గా మారి వారి కెరీర్ లో హిట్ అనేది అందుకోవడానికి చాలా టైం పడుతుంది.

అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా చేసిన తరువాత ఆయన హీరోగా విజయాన్ని అందుకోవడానికి చాలా సమయం పట్టింది అని చెప్పవచ్చు. మగధీర సినిమాలో ఆయన చరణ్ ను చూపించిన తీరు అమోఘం. అలాంటి సమయంలో అలాంటి పాత్రలో రామచరణ్ చూసిన తరువాత ఓ సాఫ్ట్ రోల్స్ లో ఆయనను చూడడానికి ప్రేక్షకులు ఏమాత్రం ఇష్టపడలేదు. దాంతో ప్రేక్షకులు రామ్ చరణ్ అంతటి స్థాయి మంచి పాత్ర చేసేంత వరకు వేచి చూడవలసి వచ్చింది. అలా హిట్ సంపాదించుకుని మళ్ళీ గాడిలోకి వచ్చాడు రామ్ చరణ్.

బాహుబలి లో ప్రభాస్ ను అలా చూసిన ప్రేక్షకులు అయన ను మరో రోల్ లో చూడలేకపోతున్నారు. నితిన్ హీరోగా రాజమౌళి సై అనే సినిమా చేయగా ఆ చిత్రం తర్వాత ఈ కుర్రహీరో ఎంతగా కుదేలయిపోయాడు అందరికీ తెలిసిందే. రాజమౌళితో సినిమా చేస్తే విజయం తప్పనిసరిగా వస్తుంది కానీ ఆ తరువాత అంతటి స్థాయిలో సినిమాలు చేయకపోతే మాత్రం సదరు హీరో కెరీర్ బాగా డల్ అవుతుందని కొంతమంది హీరోలు అనుకుంటున్నారు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అప్పుడప్పుడు వెనకడుతున్నారు. ఒక సినిమా బాగా చేసినా తప్పే బాగా చేయకపోయినా తప్పే అని రాజమౌళిని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశాడు. మార్చి 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: