వరుస క్రేజీ సినిమా ఆఫర్ లతో ఫుల్ స్పీడ్ మీద ఉన్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కృతి శెట్టి తెలుగు సినిమా  ఇండస్ట్రీ లోకి  ఉప్పెన మూవీ తో ఎంట్రీ ఇచ్చింది, ఈ మూవీ కి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు, ఉప్పెన మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లో కృతి శెట్టి అందచందాలకు,  నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇలా మొదటి సినిమాతోనే  టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది,  ఉప్పెన మూవీ తర్వాత కృతి శెట్టి కి వరుస సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

 ఇలా ఇప్పటి వరకు కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి,  ఇది ఇలా ఉంటే కృతి శెట్టి ప్రస్తుతం  ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,  ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది.బ్ ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతి శెట్టి,  సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది, ది వారియర్ మూవీ లో కృతి శెట్టి,  రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటిస్తోంది,  అలాగే మాచర్ల నియోజకవర్గం మూవీ లో కృతి శెట్టి,  నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది,   ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కృతి శెట్టి కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా,  మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో కూడా కృతి శెట్టి కి అవకాశం దక్కినట్టు వార్తలు వస్తున్నాయి, ఇలా ఇప్పటికే మూడు సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు మరో రెండు సినిమాల్లో అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: