ఆ కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..?(సూర్య)

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ చాలా సినిమాలు చేసినా రాని ఇమేజ్ ఒక్క సినిమాతోనే సంపాదించుకుంది కృతి శెట్టి. ఆ సినిమా పేరే ఉప్పెన. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో శృతి శెట్టి పర్ఫామెన్స్ కు టాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే తన అసలు పేరు వదిలేసి బేబమ్మ అనే పేరుతో ఎక్కువగా ఆమెని పిలుస్తున్నారు. అంతలా తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన తర్వాత నాని సరసన శ్యామ్ సింగరాయి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ ఏడాది ఆరంభంలోనే అక్కినేని నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది కృతి శెట్టి. ఇక తాజాగా ఈ బ్యూటీకి ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోయే తర్వాతి సినిమాలో కృతి శెట్టికి అవకాశం లభించినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా 'ఈటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నుండి బయటపడేందుకు సూర్య వెంటనే తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈక్రమంలోనే తన నెక్స్ట్ మూవీ బాలా డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కృతి శెట్టిని తాజాగా చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. ఇక బాలా - సూర్య కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి అగ్ర తారాగణం ఉన్న సినిమాలో కృతి శెట్టి కి అవకాశం లభించడం నిజంగా విశేషమనే చెప్పాలి. అయితే నిజంగానే ఈ సినిమాలో కృతి శెట్టి నటించబోతుందా అనే విషయంపై ఇప్పటివరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ విషయమై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: