టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మలు వీరే..!

Pulgam Srinivas
ఒకప్పుడు హీరోలు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారు,  కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి,  హీరోయిన్ లకు కూడా వరుస విజయాలు దక్కినట్లు అయితే ఆ ముద్దుగుమ్మలు కూడా హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ లను తీసుకుంటున్నారు,  టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం...
నయనతార  : లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతార ఒక సినిమాకు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అనుష్క శెట్టి : అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది, అలా ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనుష్క శెట్టి ఒక్క సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
సమంత : సమంత ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లు సమాచారం.
పూజా హెగ్డే : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లు సమాచారం.
రష్మిక మందన : నేషనల్ క్రష్ రష్మిక మందన ఒక్కో సినిమాకు 2. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కీర్తి సురేష్ : మహానటి సినిమాతో నటిగా ఎంతో మంది ప్రశంసలను అందుకున్న కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కాజల్ అగర్వాల్ : పెళ్లి తర్వాత కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఒక్కో మూవీ కి రెండు కోట్ల వరకు రెమ్యునిరేషన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇలా వీరితో పాటు తమన్నా,  కియారా అద్వానీ, రాశి ఖన్నా,  రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి లాంటి హీరోయిన్ లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: