పూజా హెగ్డే పాటకు.. డాన్స్ వేస్తున్న కీర్తి సురేష్..!!

Divya
 సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు అందరూ ఎక్కువగా ఇతర హీరోయిన్ పాటకు డాన్స్ వేయడం కామన్ గా మారుతోంది. నిన్న మొన్నటి వరకు సమంత,పూజా హెగ్డే వేయగా.. ఇప్పుడు తాజాగా మహానటి కీర్తిసురేష్ కూడా పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని పాటకు డాన్స్ వేస్తూ తెగ హల్చల్ చేస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా చాలా ట్రెండీగా మారుతోంది వాటి గురించి చూద్దాం.
ఇక ప్రేక్షకులు, సిని ప్రముఖులు సైతం పాట నచ్చిందంటే చాలు మనస్ఫూర్తిగా స్పందిస్తూ ఉంటారు. ఇక కొద్ది రోజుల కిందట పుష్ప సినిమాలో పాటకి ఎక్కువగా స్టెప్పులు వేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి క్రేజ్ కలిగిన కోలీవుడ్ సాంగ్.."హలమితి హబిబో"అనే పాట సినీ సెలబ్రిటీలు, సామాన్యులు సైతం ఈ పాటకు ఫిదా అవుతున్నారు.. తాజాగా కీర్తి సురేష్ కూడా ఈ పాటకు ఓ రేంజ్లో స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో తన సోషల్ మీడియా నుంచి పోస్ట్ చేయడంతో ట్రెండ్ గా మారుతోంది. ఇక ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పూజ హెగ్డే లు కలిసి నటిస్తున్నారు.. ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమాకి సంగీతాన్ని రవిచందర్ అందిస్తున్నారు.. ఇక ఈ పాట నుంచి ఇదివరకే...."హలమితి హబిబో "పాట కు సంబంధించి.. వీడియో సాంగ్ లో విడుదల చేయడంతో ఈ పాట చాలా పాపులర్ గా మారింది. ఇక ఈ పాటకు రిలీజ్ చేస్తే ఎంతో మంది వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.. ఇక ఈ పాట కి కీర్తి సురేష్ టాలెంటెడ్ మేనేజర్ అక్షిత సుబ్రహ్మణ్య తో కలిసి డాన్స్ వేయడం జరిగింది.. పంజాబీ డ్రెస్సులు కీర్తి సురేష్ అక్షిత తో డాన్స్ వేయడంతో అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: