చరణ్, రాజమౌళి మళ్లీ ఊహించగలమా!

P.Nishanth Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రావాలని చాలా రోజుల నుంచి అభిమానుల నుంచి డిమాండ్ ఉంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ప్రభంజనం సృష్టిస్తుంది అనేది వారి ఆలోచన. అలా రామ్ చరణ్ హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ దర్శకుడు వల్లనే. చిరుత సినిమా తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చరణ్ మగధీర సినిమాతో విజయాన్ని అందుకుని ప్రేక్షకులను మెప్పించాడు.

ఆ సినిమా అప్పట్లోనే భారీస్థాయిలో రికార్డులను సృష్టించింది. ఇంకా కొన్ని రికార్డులు ఏ సినిమా కూడా అందుకోలేకపోవడం విశేషం. మగధీర సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం చాలా మంది ఎదురు చూశారు. కానీ అది కుదరలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రావడం అందరినీ సంతోష పెడుతుంది. ఇది మళ్లీ మగధీర ఫలితాన్ని పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా అభిమానులకు ఇది పూర్తి స్థాయి లో సంతృప్తి పరిచే సినిమా కాకపోవచ్చు.

ఎందుకంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ కాకుండా ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా విజయం సాధించిన కూడా చరణ్ కు సగం క్రెడిట్ దక్కుతుంది కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రావాలని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ప్రేక్షకులను అలరించాలని చెబుతున్నారు. ప్రస్తుతం భారీ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు చరణ్. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్, గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: