మరో ప్రయోగాత్మకమైన పాత్రలో సూర్య..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోలు ఉంటారు,  కానీ అలా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరో లలో కొంత మంది కమర్షియల్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటు అంటే,  మరి కొంత మంది ప్రయోగాత్మకమైన సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఉంటారు, అలాగే మరి కొంత మంది హీరోలు కమర్షియల్ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ప్రయోగాత్మకమైన సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు,  అలా కమర్షియల్ సినిమా లోనూ,  ప్రయోగాత్మకమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకరు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే, ఇలా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న ఈ హీరో ఇంత వరకు ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు, అలాగే ప్రయోగాత్మకమైన సినిమాల్లో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నాడు,  అయితే సూర్య మరో సారి ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.  

ప్రస్తుతం సూర్య 'ఈటి' సినిమాలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే,  ఈ సిని మా మార్చి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది,  ఈ మూవీ తరువాత చేయడానికి వెట్రిమారన్... బాలా ప్రాజెక్టులను సూర్య లైన్ లో  పెట్టాడు. బాలా దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ సినిమా లో ఒక పాత్ర లో ఆయన చెవిటి - మూగ పాత్ర లో కనిపిస్తాడని చెబుతున్నారు, ఈ పాత్ర సరసన జ్యోతిక కథానాయిక గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇలా సూర్య మరోసారి ప్రయోగాత్మకమైన పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: