కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించనున్న అనుష్క..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు , అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో  కొంత మంది కమర్షియల్ సినిమాలలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటు స్టార్ హీరోయిన్ లుగా ఎదుగుతూ ఉంటారు.  అదే మరి కొంత మంది హీరోయిన్ లు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంటారు,  అలాగే మరి కొంత మంది హీరోయిన్ లు కమర్షియల్ సినిమాలలో నటించి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి హీరోయిన్ లుగా మంచి గుర్తింపును సాధిస్తూ ఉంటారు,  అలా మొదట కమర్షియల్ సినిమాల ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి,  ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలో అనుష్క శెట్టి ఒకరు.

  ఈ ముద్దుగుమ్మ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది,  అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  అలాంటి తరుణం లోనే అనుష్క నటించిన అరుంధతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా నటిగా అనుష్క కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది,  అయితే అనుష్క ఆ తర్వాత కూడా రుద్రమదేవి, భాగుమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి,  కోలీవుడ్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలో అనుష్క  నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఎ.ఎల్.విజయ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అనుష్క ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి,  ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: