పెళ్లికి నో.. పిల్లలకు ఓకే.. అదే ఆయన సూత్రం..!

NAGARJUNA NAKKA
మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి మంచి ప్రాధాన్యత ఉంది. వివాహ బంధం ఏర్పడాలంటే ఎన్నో చర్చలు జరగాలి. ఇరుకు కుటుంబాలు కలవాలి. మంచి చెడ్డా ముచ్చటించుకోవాలి. కట్నకానుకలు.. పెళ్లి జరిగే తీరుపై ఎన్నో చర్చలు జరగాలి. తర్వాత షాపింగ్ లు.. స్నేహితులు.. బంధువులతో ఆ పెళ్లి తంతు వైభవంగా జరుగుతుంది. అలాంటి వివాహాన్ని లైట్ గా తీసుకుంటున్నాడు ఆ నటుడు.
 
సినీనటులు  కాంట్రవర్శీస్‌కి చాలా దూరంగా ఉంటారు. ఏ మాత్రం నెగటివిటీ వచ్చినా, కెరీర్‌ ఎఫెక్ట్ అవుతుందని భయపడుతుంటారు. అయితే అర్జున్‌ రామ్‌పాల్‌ మాత్రం ఇలాంటి విషయాలని పట్టించుకోవడం లేదు. పెళ్లి, పిల్లల గురించి బోల్డ్‌గా మాట్లాడి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. అర్జున్‌ రామ్‌పాల్ నాలుగేళ్ల నుంచి సౌతాఫ్రికా మోడల్‌ గాబ్రియోల్లా డిమెత్రియాదెస్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. మూడేళ్ల కిందట వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే పిల్లాడు పుట్టాడు కదా ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే ఫిలాసఫీలు చెప్తున్నాడట అర్జున్ రామ్‌పాల్.
అర్జున్ రామ్‌పాల్‌ 2018లో భార్య మెహర్ జెసియాకి విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి గాబ్రియెల్లాతో సహజీవనం చేస్తున్నాడు. ఈ రిలేషన్‌లోనే ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ పిల్లాడు స్కూల్‌కి వెళ్లే ఏజ్‌ కూడా వచ్చింది. దీంతో అర్జున్, గాబ్రియెల్లా పెళ్లి చేసుకుంటే పిల్లడి లైఫ్‌ బాగుంటుందని చాలామంది సలహాలు ఇస్తున్నారు. అయితే అర్జున్‌ రామ్‌పాల్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట.  
గాబ్రియెల్లా నా ప్రపోజల్‌ యాక్సెప్ట్‌ చేసినప్పుడే మా ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సమాజం కోసం రింగులు మార్చుకోవడం, ఏడడుగులు వేయడం లాంటివి చేయనక్కరలేదు. అఫీషియల్‌గా పెళ్లి చేసుకోకపోయినా, మేం భార్యభర్తల కంటే ఎక్కువే. గాబ్రియెల్లా కూడా ఇలాంటి ఫార్మాలిటీస్‌ని పట్టించుకోదని చెప్పాడు అర్జున్‌ రామ్‌పాల్‌. ఇక ఈ సమాధానం విని భలే జోడి అని జోకులు పేల్చుతున్నారు ముంబయి జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: