భీమ్లా నాయ‌క్ : న‌చ్చావు రా ప‌వ‌న్.. ఇట్లు నీ ప‌వ‌ర్ స్టార్

RATNA KISHORE
భీమ్లా నాయ‌క్ : న‌చ్చావు రా ప‌వ‌న్.. ఇట్లు నీ ప‌వ‌ర్ స్టార్  

కొన్ని అసాధ్య‌త‌లు దాటి రావాలి..కొన్ని వద్ద‌నుకుని ప్రయాణించాలి.ఈ రెండూ కూడా కొన్ని సార్లే కుదిరే ప‌నులు.కుద‌ర‌నివి ఎన్నో! సినిమా స్థాయిని పెంచేందుకు చేసే కృషి వేరు.. స్థాయి ఉన్న‌ప్పుడు దానిని  నిలుపుకునేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నం వేరు. ప‌వ‌న్ .. త‌న సినిమాల‌తో స్థాయి నిలుపుకునే ప్ర‌య‌త్నాలు అస్స‌లు చేయాల‌నుకో డు.స్థాయి మ‌రిచి ప్ర‌వ‌ర్తించ‌మ‌ని ఎవ్వ‌రికీ చెప్ప‌డు. ప్రోత్స‌హించ‌డు.ఈ సినిమా చేశాను మీకు నచ్చితే చూడండి..లేదంటే లేదు..అని మాత్ర‌మే చెబుతాడు.ఆ విధంగా ప‌వ‌న్ వందో సారి మ‌రియు వెయ్యో సారి బాగా న‌చ్చుతాడు.వీలున్నంత వ‌ర‌కూ త‌న వంతు సాయం చేస్తాడు.ఈ రెండు ప‌నులూ మిగ‌తా హీరోలూ చేయాలి.చేస్తే మేలు. చేస్తార‌న్నది ఓ ఆశ.అతి వాగుడు లేని మ‌నిషి  జీవితాన రాణిస్తాడు.అందుకు ప‌వ‌న్ ఓ ఉదాహ‌ర‌ణ.వీలున్నంత వ‌ర‌కూ మీరు ఆడంబ‌రాలు త‌గ్గించి ఇంకొక‌రికి అండ‌గా ఉండండి..ఇది కూడా ప‌వ‌న్ మాత్ర‌మే చెబుతాడు.సినిమా చేశాక లాభ‌లొస్తే పంచుతా డు,న‌ష్టాలు వ‌స్తే తానే అన్నీ అయి నిర్మాత‌కు అండ‌గా ఉంటాడు.ఏం చెప్పినా,ఏం చేసినా మిగ‌తా హీరోల‌కు అత‌డు భిన్నం.అడ‌విని న‌చ్చుతాడు.అడ‌వి పాట‌ను మెచ్చుతాడు.ఆ విధంగా ఏం చేసినా,ఏం చెప్పినా ఇత‌రుల‌కు అత‌డి పంథా ఓ ఆద‌ర్శం. ప‌వ‌న్ ను చూశాక అభిమానులు నేర్చుకోవాల్సిన‌వి ఇవే..! 

సినిమాను ఆపేయండి.. ఏం కాదు.ఆలోచ‌న‌ల‌ను ఆపేయండి ఏం కాదు. అభిమాను ల‌ను ఈడ్చి,ఈడ్చి త‌న్నండి ఏం కాదు.ఎందుకంటే మీ ఓటు బ్యాంకు మీకు ప‌దిలంగా ఉన్న‌ది క‌నుక‌! ఉన్న‌వి ఎల్ల‌కాలం ఉండ‌వు అని తెలుసుకుంటే తండాల్లో జ‌నాల తిరుగుబాటు న‌గరాల్లో జ‌నాల తిరుగుబాటు రెండూ స‌మం అయ్యే స‌మ‌యం వ‌స్తే అప్పుడు త‌ప్పక ఏలిక‌లు లేదా పాల‌కులు ఇంటికి ప‌రిమితం అయితే ఆ రోజు.. ఇప్ప‌టిలా మీరుండ‌రు..మీ పార్టీ కూడా ఉండ‌దు...అన్న‌ది జ‌న‌సైనికుల శ‌క్తిమంతం అయిన హెచ్చ‌రిక..అందిస్తూ వెళ్తున్నారు.స్టేష‌న్ లో కొత్త కానిస్టేబుల్ కు ఉన్నంత పొగ‌రు..తుపాకీ మోత‌ల్లో దూసుకుపోవాల‌న్నంత వేగం అన్నీ అన్నీ అంద‌రిలోనూ ఉండాలి ఉంటాయి కూడా! ఎస్సై భీమ్లా నాయ‌క్ ఇంకొంత పై స్థాయిలో ఉంటాడు క‌నుక వాడి పొగ‌రు..కార‌ణంగానే త‌ల ఎగ‌రేస్తాడు.. దానిని ఖాకీ పొగ‌రు అని రాయా లి..దానిని అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కే వాడాలి.మ‌న ఏపీ పోలీసు కూడా అవ‌స‌రం ఉన్నంత వర‌కే అధికారం వాడాలి..అన్నది జ‌న‌సేన విన్న‌పం. కానీ సాధ్య‌మా ?

ప‌చ్చందనాల అడవులు 
అడ‌వుల మ‌ధ్య మ‌నుషులు 
ఒక‌ప్పుడు మ‌నుషుల మ‌ధ్య 
అడ‌వి..
వానొచ్చి తుఫానొచ్చి క‌ద‌లిక లేని అడ‌వి 
ఇప్పుడు మ‌రో  తుఫానును ఎదుర్కొంటోంది 
తెలంగాణ ఆంధ్రా స‌రిహ‌ద్దులో ప‌వ‌న్ తీసుకువ‌చ్చిన‌
తుఫాను పేరు భీమ్లా నాయ‌క్.

శ్రీ‌శైలం దారుల్లో అడ‌వి అందంగా ఉంది.ప్ర‌శాంతంగా ఉందో,లేదో అన్న‌ది తెలియ‌దు.అడ‌విలో మ‌నుషులు కొన్ని విభేదాల‌తో ఉన్నారు.అడ‌వితో పాటు మ‌నుషులు కూడా జంతువుల‌ను పోలి ఉన్నారు.అడ‌వితో పాటు మ‌నుషులు దైవాన్ని పోలి ఉన్నారు.జంతువు కొంద‌రికి, దేవుడు ఇంకొంద‌రికి వాడే భీమ్లా నాయ‌క్. 

ఆత్మ‌విశ్వాసం నెగ్గిన  చోట 
అహంకారం ప‌త‌నం అయిన చోట 
ఓ ఆడ‌బిడ్డ‌కు భ‌రోసా ఇచ్చి నిలిచిన చోట‌
ఎంద‌రో ఆడ బిడ్డ‌ల ఆనందాల‌కు కార‌ణం అయిన చోట
పవ‌న్  ఉన్నాడు. ఉంటాడు కూడా! 

భీమ్లా నాయ‌క్ సినిమా అదిరిపోయింది.బాక్సాఫీసుకు బొనాంజా! ఆయ‌న ఎంచుకున్న క‌థ‌ను న‌మ్మిన రీతిలో తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ సాగ‌ర్. మాట‌లు మ‌రీ అంత గొప్ప గా లేకున్నా అతి అయితే లేదు.సినిమాలో ఎక్క‌డా అతి లేదు.ర‌క్త పాతం ఎలానూ ఉండ‌దు.అడ‌వి అందాల న‌డుమ న‌డుచుకువ‌చ్చిన దేవర సాక్షి అన్న విధంగా ఈ సినిమా..అడ‌విని అమ్మోరుతో పోల్చాడు.ఆఖరి వ‌ర‌కూ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాడు.సామాజిక స్పృహ నిండిన సినిమా. ప్ర‌తి ప‌వ‌న్ అభిమాని మ‌రో ఆడ‌బిడ్డ‌కు అండగా నిలిచి,ఆయ‌న  స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ల‌మ‌ని చెప్పిన సినిమా.

మెయిన్ స్ట్రీమ్ లో ఇద్దరి కొట్లాట‌లా ఉన్నా అది కూడా అతి అనిపించ‌దు. ప‌వ‌న్ సినిమాల్లో పాట‌లు ఒదిగి ఉంటాయి.భ‌లే రాయించార్రా అన్న విధంగా ఈ పాట‌లు లేక‌పోయినా నేప‌థ్య సంగీతం బాగుంది.ఫ్యాన్స్ కోరుకున్న విధంగా పూన‌కాలు ర‌ప్పించే విధంగా త‌మ‌న్ సంగీతం బాగుంది.స్టంట్స్ ను డిజైన్ చేసిన ప‌ద్ధ‌తి బాగుంది. క‌థేంటి కాక‌ర‌కాయేంటి ఈ ద‌రిద్రం నేను రాయ‌ను కానీ ఎడిట‌ర్ కూడా  మంచి తెలివైనోడు బుర్ర‌కు మ‌రియు క‌త్తెర‌కు ప‌ని బాగానే చెప్పాడు.ఆ న‌వీన్ నూలి ముందున్న కాలంలో ఇంకొంత రాణించే అవ‌కాశాలున్నాయి. 

సినిమా,సినిమాకూ ఆయ‌న బాధ్య‌త పెరిగిపోతోంది.ఇమేజ్ పెరిగిపోతోంది.మోయడం క‌ష్ట‌మే. కేటీఆర్ అన్న విధంగా ఓ పాతికేళ్లు అలానే మోశాడు.మోస్తున్నాడు ప‌వ‌న్. ఒంటికి గాయాల‌యినా భ‌రిస్తున్నాడు.కానీ  అభిమానుల‌ను ఆనందింప‌జేయ‌డం, వీలున్నంత వ‌ర‌కూ వారిలో సామాజిక స్పృహ పెంపొందింప‌జేయ‌డం అన్న‌వి ఇవాళ ఆయ‌న ముందున్న క‌ర్త‌వ్యాలు..ముందుకు న‌డిపే ఆశ‌యాలు కూడా ఇవే! సినిమాలో అదే ప‌నిగా గీతాబోధ‌లు లేవు కానీ మంచి ప‌నులు చేసే వేళ ఆయ‌న ఎంత ఆనందిస్తారో..ఓ మంచి  స్థిరం అయ్యే వేళ కూడా ఆయ‌న ఎంత‌గా అండ‌గా ఉంటారో అన్న‌ది భీమ్లా నాయ‌క్ చాటింది.ఆయ‌న గిరిజ‌న తండాల‌పై మ‌క్కువ ఉంది.వారికి ఏదైనా చేయాల‌న్న త‌ప‌న ఉంది.ఈ పాటి త‌ప‌న మ‌న నాయ‌కుల‌కు లేదు.ఇది ఫిక్స్.ఇవాళ రాజ‌కీయంగా ఆయ‌న ఓట‌మి పొందారో,గెలుపు పొందారో అన్న‌వి అటుంచితే సినిమాను అడ్డంపెట్టుకుని రాజ‌కీయం చేయాల్సిన ఖ‌ర్మ అయితే ఆయ‌న‌కు లేదు.రాదు కూడా!

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: