కళావతి సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేసిన పూర్ణ.. వీడియో..

Satvika
తెలుగు ప్రేక్షకులకు పూర్ణ పేరు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. చేసింది కొన్ని సినిమాలు అయిన కూడా అందరికి బాగా దగ్గరైంది. అంతేకాదు కొన్ని టీవీ షో లలో కూడా చేసింది. యూత్ కు బాగా దగ్గరైంది. ఇకపోతే డీ డ్యాన్స్ షో ద్వారా మరింత ఫెమస్ అయ్యింది. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుంచి అమ్మడు తప్పుకుంది.త్రీ రోజెస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఆ షో ద్వారా అందరికి బాగా దగ్గరైంది.

హార్రర్ సినిమాలు ఎంథగా పాపులర్ అయ్యాయో పూర్ణ కూడా అంత ఫెమస్ అయ్యింది.తీస్ మార్ ఖాన్' మూవీలోనూ నటించింది బాగా పాపులర్ అయింది. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.అందాల ఫొటోలని షేర్ చేస్తూ నెటిజన్లకు మంచి కిక్ ఇస్తూ వస్తుంది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ పూర్ణ మరోసారి ఒక వీడియో ను షేర్ చేసింది. అది కాస్త వైరల్ అవుతుంది.మహేష్ బాబు మాదిరిగా పూర్ణ వేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం పూర్ణ డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా అవుతుంది. లైకులు షేర్లు కామెంట్ల తో బాగా చక్కర్లు కోడుతుంది..

ఆ పాటలో మహేష్ వేసిన స్టెప్పులు అందరినీ ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలుసు.. ఆ పాట విడుదల అయిన నాటి నుంచి నేటి వరకూ చాలా మంది సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ కూడా ఆ మాటకు కాలు కదుపుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. సినిమా విడుదలకు ముందే సర్కార్ వారి పాట సినిమా మంచి టాక్ ను అందుకుంది.ఇటీవలే మహేష్ కూతురు సితార, హీరోయిన్ కీర్తి సురేష్ లు కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము దులిపేశారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: