అరుదైన ఘనత సాధించిన కాజల్ అగర్వాల్..!!

Divya
లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై ముద్దుగుమ్మ.. చందమామ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కాజల్ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది.. తన భర్త తో కలిసి ఒక బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ ట్వీట్ కూడా చేసింది.
తన బేబీ బంప్ కు సంబంధించిన ఫోటోలు,  వీడియోలు ఈమె అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. ఇక వీటిని నెటిజన్లు కూడా అమితంగా ఆకర్షించడంతో పాటు వీరు వాటిని బాగా వైరల్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం గమనార్హం.. ఏమిటంటే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కి చేరుకోవడం గమనార్హం.. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రో బ్యాక్ ఫోటోలను కూడా షేర్ చేసి మరోసారి రికార్డు సృష్టించింది..
ఇక ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఈమే.. తాజాగా నా ఇన్ స్టా ఫ్యామిలీకి 21 మిలియన్స్ ప్రేమను అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక మీకు 21 మిలియన్ రెట్ల ప్రేమను అందిస్తున్నాను అంటూ ఈ చందమామ రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ముద్దుగుమ్మలలో కాజల్ కూడా ఒక్కరు.. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చాలా దగ్గరవుతోంది.. ఇక ఈ క్రమంలోనే ఈమెకు  రోజు రోజు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక ఏది ఏమైనా కాజల్ ఇలాంటి ఘనత సృష్టించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: