ఫిలిం ఇండస్ట్రీ: మైనపు బొమ్మ కాజల్ అగర్వాల్ @15 యేళ్లు..!!

Divya
సినీ ఇండస్ట్రీలోకి నటీనటులు అడుగు పెట్టి తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే.. తాము తమ కెరియర్లో మంచి ఫాంలో దూసుకు పోతూ ఉంటారు.. సంవత్సరాలు గడుస్తున్నా కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోలుగా.. హీరోయిన్ లుగా అలరిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే 2,3 సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ వుంటారు అన్న విషయం అందరికి తెలిసిందే.. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎప్పటికీ తమ క్రేజ్ ను తగ్గించుకో కుండా స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతూ ఉంటారు.. ఇక అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు .. నేటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తయింది.. ఇక కాజల్ సినీ కెరీర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1985 జూన్ 19న మహారాష్ట్ర లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారి తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా 2007లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత చందమామ సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకుంది.. అంతేకాదు ఈ సినిమా ద్వారా  ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 2009లో హిస్టారికల్ ఫిక్షన్ తెలుగు మూవీ అయినటువంటి మగధీర లో నటించి స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది..
అంతేకాదు ఈమె ఎంచుకున్న ప్రతి సినిమా కూడా కమర్షియల్ హిట్ గా విజయాలను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇకపోతే ఈమె నటనకు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పలు అవార్డులు కూడా లభించడం గమనార్హం.. ఆ తర్వాత తెలుగు , తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సింగం అనే సినిమా ద్వారా హిందీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక హిందీలో మూడు సినిమాలు నటించినప్పటికీ అవి మూడు కూడా విజయవంతం కావడం గమనార్హం..
అంతేకాదు 2020లో సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో కాజల్ అగర్వాల్ కు సంబంధించి మైనపు బొమ్మలను ప్రదర్శన కూడా ఉంచడం జరిగింది. అంతే కాదు దక్షిణభారత సినిమాకు చెందిన మొదటి నటిగా ఈ ఘనత సాధించింది కాజల్ అగర్వాల్..
2020 అక్టోబర్ 30 వ తేదీన ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని ప్రస్తుతం గర్భం దాల్చింది.అంతే కాదు అదే సంవత్సరం ఆమె గోల్డెన్ వీసా ను అందుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: