ఊహించని ట్విస్ట్.. ఎక్కడ తగ్గాలో తెలిసిన బాలయ్య..

Deekshitha Reddy
నందమూరి బాలకృష్ణ ఇటీవల రూటు మార్చారు. రాజకీయాల్లో తన ఆలోచనలు ఎలా ఉన్నా.. ఇండస్ట్రీలో మాత్రం బాలయ్య అన్ స్టాపబుల్ అనిపించుకున్నారు. ఆహా ఓటీటీ రాకపోయి ఉంటే అసలు బాలయ్య టాలెంట్ బయటపడేది కాదంటున్నారు చాలా మంది. అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సరికొత్త బాలయ్యను చూస్తున్నామని చెబుతున్నారు అభిమానులు. అయితే ఆ కార్యక్రమం అనూహ్యంగా ఇప్పుడు ఆగిపోతోంది. ఆగిపోతోంది అంటే పర్మినెంట్ గా కాదు, కేవలం టెంపరరీ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 కి మహేష్ బాబు ఎపిసోడ్ తో చిన్న కామా పెట్టారు.
హిట్ సిరీస్ లో బ్రేక్ ఎందుకు..?
సహజంగా ఏదైనా హిట్ సిరీస్ నడుస్తుంటే దాన్ని ఎన్నిరోజులైనా కొనసాగించాలనుకుంటారు నిర్వాహకులు. కానీ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ కి మాత్రం ఇప్పుడు పాజ్ బటన్ నొక్కేశారు. బాలకృష్ణ ఆలోచన వల్లే దీన్ని తాత్కాలికంగా పక్కనపెట్టారని తెలుస్తోంది. సీజన్ 1 క్రేజ్ తో త్వరలో సీజన్ 2 కంటిన్యూ చేస్తారని అంటున్నారు.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎక్కడా బోర్ లేకుండా సాగిపోతోంది. ఇప్పటి వరకూ అందరూ చూసిన ఇంటర్వ్యూలలాగా కాకుండా కొత్తగా, వెరైటీగా ఆకట్టుకుంటున్నారు బాలయ్య. మధ్య మధ్యలో మరుగునపడిపోయిన కొంతమంది జీవితాలని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. కేవలం ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలని ఈ షో ద్వారా నిరూపించారు. అంతా అనుకున్నట్టు పక్కాగా సాగిపోతున్నా.. ఎక్కడో ఓ చోట బోర్ కొట్టక మానదు. అందుకే అంతవరకు వెయిట్ చేయకుండా దీనికి వెంటనే బ్రేక్ ఇచ్చారు. కొత్త సిరీస్ ని సరికొత్తగా మొదలు పెడతామంటున్నారు.
ఎక్కడ నెగ్గాలో కాదు..
మొత్తమ్మీద సక్సెస్ పుల్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ కి, స్టాప్ బోర్డ్ చూపించి షాకిచ్చారు బాలయ్య. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసని నిరూపించాడు. మహేష్ బాబు ఎపిసోడ్ పై వదిలిన ప్రోమోలు ఇప్పటికే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సీజన్ కి మహేష్ బాబు ఎపిసోడ్ తో గుడ్ బై చెప్పేసి, సెకండ్ సీజన్ పై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: