బ్రేకింగ్ : నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం...!

murali krishna
సీనియర్ నటి అయిన జయప్రద తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా జయప్రద ఇంట తీవ్ర విషాదం నెలకొందట.. అసలు జయప్రద ఇంట్లో ఏం జరిగింది? జయప్రద ఎందుకు విషాదంలో కూరుకుపోయింది అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
చాలా మంది నటీమణులు లానే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యిందట ఈ సీనియర్ నటి జయప్రద. జయప్రద అసలు పేరు లలితా రాణి కాగా ఆమె 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించిందని తెలుస్తుంది.. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం మరియు నృత్యంలో శిక్షణ తీసుకున్న ఆమె ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన ఇవ్వడంతో దానిని చూసి మైమరచి పోయిన ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి తను నటించే భూమికోసం చిత్రంలో చిన్న వేషం ఇప్పించాడట.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'జయప్రద ఫిలింస్' బ్యానర్ పేరు ఆమెకు పెట్టారని ఆ సినిమాకు దర్శకుడు తిలక్.
అప్పటినుంచి లలితా రాణి కాస్త జయప్రద గా మారిందట.అలా మొదలైన ఆమె సినీ కెరీర్ ఎనిమిది భాషల్లో 300 చిత్రాలకు పైగా కొనసాగుతూనే ఉందని ఇక నటిగా తొలి రోజుల్లోనే కె.బాలచందర్ మరియు కె.విశ్వనాథ్ వంటి పెద్ద డైరెక్టర్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.అదే ఆ తరువాత రోజుల్లో జయప్రదకు అధ్బుత నటిగా పేరు సంపాదించి పెట్టిందట.ఇక తెలుగులో దాదాపు అప్పటి అగ్ర హీరోలు అందరితో కూడా జయప్రద కలిసి నటించింది
ఇక సినీ రంగంలో కాకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టి రాజ్యసభ సభ్యురాలిగా కూడా పని చేసిందట జయప్రద. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాంపూర్ లోక్ సభ సభ్యురాలిగా ఆమె ఎన్నికైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయి అమర్ సింగ్ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.గత ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయి రామ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఇక ప్రస్తుతానికి ఆమె కాస్త సైలెంట్ గానే ఉన్నారని తెలుస్తుంది.

అయితే నటి జయప్రద తల్లి నీలవేణి మంగళవారం నాడు సాయంత్రం అనారోగ్య కారణాలతో కన్నుమూశారట.వయోభారంతో బాధపడుతున్న ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.. ఇక ఆవిడ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు.. నీలవేణి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలని తెలుస్తుంది.. ఆమెకు జయప్రదతో పాటు సౌందర్య రాజబాబు శ్రీరామ్ అనే సంతానం కూడా ఉన్నారు. తన తల్లి కన్నుమూయడంతో జయప్రద తీవ్ర విషాదంలో మునిగిపోయారట.. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు వారి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: