ఈ ముద్దుగుమ్మ ను ఎవరు పట్టించుకోవడం లేదే!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రమే ఇక్కడ పాతుకు పోతుంటారు. తమ టాలెంట్ తో అంద చందాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా వారిని ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే సదరు హీరోయిన్ కు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగి వారికి సినిమాల పట్ల డిమాండ్ ఏర్పడుతుంది. అలా వారికి ఏర్పడే డిమాండ్ ప్రకారం దర్శక నిర్మాతలు ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది.  ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో డిమాండ్ పెంచుకుంటూ పోతున్న హీరోయిన్ డింపుల్ హయాతి.

రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అంతకుముందు గల్ఫ్ అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఎక్కువగా గుర్తింపు లేకపోయినా కూడా అందచందాలతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విజయవంతం కాకపోవడం ఆమెను ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకుండా చేసింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆమె గద్దల కొండ గణేష్ చిత్రంలో చేసిన ఐటమ్ సాంగ్ తో ఒక్కసారిగా భారీ స్థాయిలో పాపులారిటీ అందుకుంది. ఎంతో బాగా డాన్స్ వేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

అప్పటికే ఆమె తమిళ సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడంతో తెలుగు సినిమాల్లోకి రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. ఆ విధంగా ఇప్పుడు రవితేజ సినిమాలో చేస్తున్న ఆమె ఈ చిత్రం విజయవంతం అయితే మరింతగా ఇక్కడ సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆమె ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాటలో నటించిన తీరుకు అందరు ముగ్ధులై పోయారు ఎంతో అద్భుతంగా ఆమె డాన్స్ వేసింది అని అందరూ పొగుడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఈ సినిమా విడుదల కాకముందే ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: