బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆర్ఆర్ఆర్' లేటెస్ట్ రిలీజ్ డేట్

GVK Writings
టాలీవుడ్ స్టార్ నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియా మూవీ రౌద్రం రణం రుధిరం. ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించగా ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ ని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది.
చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై మన దేశంతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. స్వాతంత్రోద్యమానికి ముందు జరిగిన కథగా భారీ యాక్షన్, ఎమోషనల్ కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసినట్లు ఇన్నర్ వర్గాల టాక్. అయితే మ్యాటర్ లోకి వెళితే, ఈ సినిమాని వాస్తవానికి జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే మన దేశంలో కరోనా మహమ్మారి మరొక్కసారి ఇటీవల పంజా విసరడం, పలు రాష్ట్రాల్లో కేసులు కూడా పెరగడంతో థియేటర్స్ సహా ఎన్నో ఆంక్షలు విధించారు.
దానితో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా వేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. అప్పటి నుండి ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు ఊరటనిస్తూ కొద్దిసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ తమ సినిమా విడుదలకి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కరోనా ప్యాండెమిక్ పరిస్థితులు ఒకవేళ తగ్గుముఖం పట్టి దేశంలో థియేటర్స్ పూర్తిగా తెరుచుకుంటే తమ సినిమాని మార్చి 18న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అప్పటికి పరిస్థితులు అదుపుకాకపోతే ఆపైన ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ తమ ప్రకటనలో తెలిపింది. దీనితో ఒక్కసారిగా అటు మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: