లైగర్ ఐటెం సాంగ్ లో పాన్ వరల్డ్ బ్యూటీ!!
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ గ్లింప్స్ విడుదల కాగా అవి భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను రాబట్టుకున్నాయి. అభిమానులు ఓ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన సెలబ్రేషన్ చేసుకున్నారు. అలా ఈ చిత్రం ఎన్నో ప్రాధాన్యతలను సంతరించు కోగా అదనపు ఆకర్షణగా ఏ ఇండియన్ సినిమా కు సాధ్యం కాని విధంగా హాలీవుడ్ నటుడు బాక్సర్ అయన మైక్ టైసన్ ఈచిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇది ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాలను కలిగించే విషయం అని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ స్టార్ ను పెట్టుకొని పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని బయటకు ప్రొజెక్ట చేస్తూ ఉండగా ఇప్పుడు మరొక ఇంటర్నేషనల్ స్టార్ ఈ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు ఆలోచనలో చేస్తున్నారట. ఈ సినిమాలో వచ్చే ఐటెం సాంగ్ కోసం పాన్ వరల్డ్ బ్యూటీ ఎంపిక చేయాలని వీరు భావిస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా అవకాశం అందుకునే పాన్ వరల్డ్ బ్యూటీ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కనుక జరిగితే ఈ విజయ్ దేవరకొండ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉంటాయి అని చెప్పవచ్చు. తొందరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.