RRR: కొత్త రిలీజ్ డేట్.. ఇదే ఫిక్స్ చేశారా..?

Anilkumar
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మరోసారి వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.కోవిడ్ ప్రభావంతో దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం మరియు పాక్షికంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పటివరకూ కొత్త రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు కాదు ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం త్రిబుల్ ఆర్ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ 29 లేదా మే మొదటి వారం మే 6 న కానీ విడుదల చేయవచ్చని విశ్వసనీయ వర్గాల నుంచి నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే దర్శక నిర్మాతలు సైతం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వేసవి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తారా? లేకపోతే పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి వల్ల ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో నిర్వహించారు మేకర్స్.

మరో వారం రోజుల్లో సినిమాని చూద్దామని ఎంతో ఆశతో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. బాహుబలి వంటి భారీ విజయం తర్వాత అగ్ర దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆలియాభట్ కీలక పాత్రలు పోషించారు. ఇక వారితో పాటు సముద్రఖని, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ సైతం పలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: