ఒమిక్రాన్: దుల్కర్ సల్మాన్ ఆరోగ్యం ఎలా ఉందంటే... ?

VAMSI
ప్రస్తుతం ప్రపంచం అంతా రెండవ సారి కరోనా మహమ్మారి చుట్టూ తిరుగుతోంది. మళ్ళీ గతంలాగే పరిస్థితులు వచ్చేలా అనిపిస్తోంది. కానీ ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో అందరికి ఊరటనిచ్చే విషయం ఒక్కటే, పెద్దగా మరణాల శాతం లేకపోవడమే. ఇదిలా ఉంటే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కరోనా భారిన పడ్డ విషయం తెలిసే ఉంటుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కరోనా నీలి ఛాయలు కమ్ముకుంటున్నాయి. వరుసగా తారలు కరోనా భారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష వంటి పలువురు తారలు కరోనా భారిన పడగా ఇపుడు మహానటి ఫేం దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకింది. మొదట స్వల్ప లక్షణాలు కనపడగానే అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకున్నారు దుల్కర్ కాగా రిపోర్ట్ చూస్తే కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా పేర్కొన్నారు.
అంతేకాకుండా సెట్ లో ఆయనతో పాటుగా ఉన్న వారంతా ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిదని తెలిపారు.  అయితే ఇపుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ అభిమానులు కలవరపడుతున్న సమయంలో ఆయన ఇపుడు ఎలా ఉన్నారు అన్న దానిపై కొంత సమాచారం అందింది. కరోనా లక్షణాలు కాస్త ఎక్కువైనట్లు తెలుస్తోంది, అయితే డాక్టర్లు ఇబ్బంది లేదని తెలిపారట, ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ డాక్టర్ పర్యావేక్షణలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఒమిక్రాన్ లక్షణాలు విషయానికి వస్తే,
*కళ్ళు ఎర్రగా మారి మంటలు,నొప్పి ఉండటం.
*కళ్ళు సరిగా కనిపించకపోవడం, మసకబారడం.
*కళ్లల్లో నుండి నీరు కారడం
* కనురెప్పలు వాపు వంటివి లక్షణాలు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ లక్షణాలు ఇవి అని పేర్కొంది. ఒమిక్రాన్ ముఖ్యంగా కల్లని టార్గెట్ చేస్తోందని తెలుస్తోంది. ఒమిక్రాన్ ఉంటే కళ్ళకల వంటి లక్షణాలు ఉంటాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: