బాలకృష్ణకు కాంపిటీటర్ ను వెతికిన అల్లు అరవింద్ !

Seetha Sailaja
ఆహా హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్’ టాక్ షోతో ఆహా పేరు ప్రతిష్టలు జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఈకార్యక్రమానికి నేషనల్ లెవెల్ లో రేటింగ్స్ టాప్ 5లో వస్తున్నాయి అన్నవార్తలు ఓటీటీ బిజినెస్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి తెలుగు కంటెంట్ తో తెలుగువారి కోసం ప్రారంభింపబడ్డ ఆహా విజయాల వెనుక అల్లు అరవింద్ సమర్థత ముందుచూపు ఉంది.

వయసు రీత్యా 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆహా టీమ్ కంటే స్పీడ్ గా పరుగులు తీస్తున్న ఆయన ఉత్సాహం చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అన్ ష్టాపబుల్ షోతో అల్లు నందమూరి కుటుంబాల మధ్య మళ్ళీ సాన్నిహిత్యం పెరిగింది. త్వరలో అల్లు అర్జున్ బాలకృష్ణ లతో కలిపి ఒక మల్టీ స్టారర్ కు రంగం సిద్ధం అవుతోంది అన్నవార్తలను బట్టి వీరి సాన్నిహిత్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఆహా లో మరో టాక్ షోకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ టాక్ షోను వెంకటేష్ హోస్ట్ చేస్తాడని అంటున్నారు. అయితే ఈషో ‘అన్ ష్టాపబుల్’ సిరీస్ ముగిసిన తరువాత మొదలవుతుందా లేదంటే మరికొంత సమయం తీసుకుని ఈటాక్ షో గురించి ఆలోచనలు చేస్తారా అన్నవిషయంలో క్లారిటీ లేదు అంటున్నారు.

వాస్తవానికి వెంకటేష్ కు ఎప్పటి నుంచో టాక్ షోలు చేయాలి అన్న అభిలాష ఉంది అని అంటారు. ఆమధ్య ‘బిగ్ బాస్’ సీజన్ 5ను వెంకటేష్ చేత హోస్ట్ చేయించాలని ప్రయత్నాలు కూడ జరిగాయి. అయితే నాగార్జున ‘బిగ్ బాస్’ సీజన్ 5ను హోస్ట్ చేయడానికి ముందుకు రావడంతో వెంకటేష్ హోస్టింగ్ ఆలోచనలు పక్కకు పడ్డాయి అని అంటారు. త్వరలో వెంకటేష్ రానా తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో కూడ ఉన్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ ఫైనల్ స్టేజ్ లో ఉందని టాక్. దీనితో ముందుగా వెంకీ ఆహా లో టాక్ షో చేస్తాడా లేకుంటే వెబ్ సిరీస్ లో నటిస్తాడా అన్నవిషయం తెలియవలసి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: