ఆ పాత్ర ఆమెకే సాధ్య‌మా..?

N ANJANEYULU
ఒక భార‌తీయ సినిమా న‌టి ర‌మ్య‌కృష్ణ‌. వాస్త‌వానికి ఆమె 1983లోనే సినిమా ప్ర‌వేశం చేసింది. కెరీర్ ప్రారంభంలో కేవ‌లం అందాల ఆర‌బోత‌కే ప్రాముఖ్య‌త ఇచ్చి.. కుర్ర‌కారు గుండెల్లో నిలిచి.. అందాల దేవ‌త‌గా ముద్ర‌వేయించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారి భ‌లే మిత్రులు సినిమాతో ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అప్ప‌టి నుంచి ఆమెకు తెలుగులో మంచి అవ‌కాశాలు ల‌భించాయి. భ‌లేమిత్రులు నుంచి బంగార్రాజు వ‌ర‌కు ఆమె క‌థానాయిక‌గా, అమ్మ‌గా, అత్త‌గా, వ‌దిన‌గా, చెల్లి, అక్క ఇలా ఆమె పోషించ‌ని పాత్ర అంటూ లేదు.
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చ‌క్ర‌వ‌ర్తి సినిమాలో చిరంజీవికి చెల్లిగా న‌టించింది.  ఇక  అమ్మోరు చిత్రంలో నటించి,  ఈమెకు  తిరుగులేదని అనిపించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి అందరి మన్ననలు పొందింది ర‌మ్య‌కృష్ణ‌. ర‌జనీకాంత్ న‌టించిన‌ నరసింహలో నీలాంబరి పాత్ర అత్యద్భుతం .ఇక ఈ పాత్రను ఈమె తప్ప మరొకరు చేయలేరనేంత‌గా న‌టించింది.  1990 నుంచి 2000 సంవత్సరం మధ్య ఏకంగా దశాబ్దకాలంపాటు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది.
ఒక 2005లో వ‌చ్చిన నా అల్లుడు సినిమా ద్వారా మోడ్ర‌న్ అత్త‌గా ప్ర‌వేశం చేసింది. హీరోయిన్ నుంచి అలా ఆంటిగా మారిపోయింది. కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సినిమాలో హీరో త‌ల్లిగా న‌టించింది. అదేవిధంగా త‌మిళ స్టార్ కార్తీ హీరోగా, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన దేవ్ సినిమాలో అత్త‌గా న‌టించింది. దేశ‌వ్యాప్తంగా చరిత్ర తిర‌గ‌రాసిన బాహుబ‌లి చిత్రంలో శివ‌గామిగా త‌న పాత్ర అత్యంత అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. బాహుబ‌లి చిత్రంలో న‌టించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది ర‌మ్య‌కృష్ణ‌.
ఇక ఆ త‌రువాత నాగచైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో అత్త పాత్ర‌లో శివంగిలా న‌టించిన‌ది. అదేవిధంగా సాయిధ‌ర్మ్‌తేజ్ హీరోగా రిప‌బ్లిక్ చిత్రంలో కూడా అద్భుతంగా న‌టించింది. పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న లైగ‌ర్ సినిమాలో కూడా విజ‌య్‌దేవ‌ర‌కొండ కు త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. ఇక తాజాగా విడుద‌లైన బంగార్రాజు చిత్రంలో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గురించి ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  ఇలా అన్ని పాత్ర‌ల్లో ఒదిగిపోయిన న‌టి ర‌మ్య‌కృష్ణ అని చెప్ప‌డంలో ఎలాంటి ఆంత‌ర్యం లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: