అనుపమ ఇక అలాంటి సీన్లకు నో..!

shami
మొన్నటిదాకా చాలా మంచి పాత్రల్లో నటించి హోంలీ హీరోయిన్ ఇమేజ్ కొనసాగించిన అనుపమ కాస్త ఒకే ఒక్క సినిమాతో ఆమె గురించి థింకింగ్ మారిపోయేలా చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన రౌడీ బాయ్స్ సినిమా ఆమె ఫ్యాన్స్ లో కొంతమందికి హర్ట్ చేసింది. అనుపమని హోంలీగా చూసేందుకే ఇష్టపడే ఆడియెన్స్ కాస్తా ఆమె లిప్ లాక్, బెడ్ సీన్స్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రౌడీ బాయ్స్ లో ఆశిష్ రెడ్డితో అనుపమ రెచ్చిపోయి మరీ అలాంటి సన్నివేశాల్లో నటించింది. అందుకు గాను అమ్మడు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నా అనుపమ ఇలా చేయడంపై ఆమె ఫ్యాన్స్ డీల్ పడ్డారు.
అయితే తనని ఇనగా ఆదరిస్తున్న అభిమానుల కోసం ఇక మీదట అలాంటి హాట్ సీన్స్ లో నటించనని చెప్పేసింది అనుపమ. రౌడీ బాయ్స్ లో ఆమె చేసిన హాట్ షోకి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారన్న రిపోర్ట్ అనుపమ దాకా వెళ్లింది. అంతేకాదు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో టచ్ లో ఉండే అనుపమ రౌడీ బాయ్స్ సినిమా కోసం తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా చెక్ చేసుకుంది. అందుకే ఇక మీదట అభిమానుల మనసు నొచ్చేలా లిప్ లాక్, బెడ్ సీన్లలో నటించేది లేదని తెగేసి చెబుతుంది అనుపమ పరమేశ్వరన్.
మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే యువ హీరోల సరసన చేస్తూ స్టార్ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్న అమ్మడు ఆ క్రమంలోనే కొత్త హీరో సినిమాలో రెచ్చిపోయి మరి హాట్ షో చేసింది. అయితే ఇన్నాళ్లు అనుపమని ఒకలా చూసిన ఆడియెన్స్ ఆమెలోని ఈ హాట్ యాంగిల్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే అనుపమ కూడా ఇక మీదట అలాంటి సీన్స్ చేసేది లేదని చెబుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: