రాజమండ్రి అమ్మాయి- రాజస్థానీ అబ్బాయి ప్రేమ కహానీ

D.V.Aravind Chowdary
చిత్ర పరిశ్రమ కు చెందిన నటినటులేవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే అదొక గొప్ప ఆసక్తికరమైన విషయం.ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కారణంగా అటువంటి పెళ్ళిళ్ళు కలకాలం నిలవవన్న అభిప్రాయం ఒకటుంది. కానీ , ఇది కేవలం అపోహే అనడానికి అనోన్యంగా ఉన్న వారే నిదర్శనం. అటువంటి వారిలో జయప్రద - శ్రీకాంత్ నహతా దంపతులు కూడా ఉన్నారు. 


భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరోయిన్స్ లో నటి ఒకరు జయప్రద. కుదురైన చూడచక్కని మొహం గల ఈమె కేవలం మొగ వాళ్ళకి మాత్రమే కాకుండా ఏంతో ఆడవాళ్లకు అభిమాన హీరోయిన్. సినిమాలకు దూరంగా ఉన్న ఎప్పటికి మరిచిపోలేని కొండంత అభిమానం ఆమె పట్ల భారత సినీ  ప్రేక్షకుల్లో ఉందన్నది యదార్థం.  

జయప్రద అసలు పేరు లలితా రాణి. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి పట్టణంలో సినీ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన ఈమె చిన్నతనం నుంచి నాట్యం అంటే ఏంతో మక్కువ . నాట్యం మీద ఇష్టం తో శిక్షణ పొంది పలు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ప్రదర్శన చూసి మెచ్చిన నాటి సినీ దర్శక దిగ్గజం తిలక్ గారు తాను తీసే భూమి కోసం చిత్రంలో అవకాశం ఇచ్చి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 


మొదటి చిత్రం తర్వాత వరుసగా ఆమెకు సినీ అవకాశాలు రావడంతో తొలుత తెలుగు కె పరిమితం అయినా తర్వాత కాలంలో తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో సైతం మంచి ప్రాధాన్యత కలిగి న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. బాలీవుడ్ లోకి అడ్డుపెట్టి అక్కడ దశాబ్ద కాలం అగ్ర కథానాయికగా చక్రం తిప్పారు. ఈమె తర్వాత బాలీవుడ్ లో ఆ స్థానాన్ని మన తెలుగు వారి అభిమాన నటి   శ్రీదేవి దక్కించుకున్నారు. 

  

జయప్రద వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె రాజస్థాన్ కు చెందిన పారిశ్రామికవేత్త, బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ నహతా తో  ప్రేమలో పడి సుమారు ఏడు సంవత్సరాలు తర్వాత ముంబై లోని తాజ్ హోటల్ లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆరోజుల్లో వీరి పెళ్లి  బాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎందుకంటే  అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లల తండ్రి అయినా శ్రీకాంత్ కు ఇది రెండో వివాహం . 


శ్రీకాంత్ తో వివాహాం తర్వాత కూడా జయప్రద సినిమాల్లో నటిస్తూ వచ్చారు కానీ  ఎన్టీఆర్ మీద అభిమానంతో 1994లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలుత రాజ్య సభ కు , తర్వాత సమాజ్ వాదీ పార్టీ నుంచి  రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న నహతా తో గడుపుతారు. వీరిద్దరి కి పిల్లలు లేకపోవడంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: