శ్రీజ తో విడాకుల పై క్లారిటీ ఇచ్చిన భర్త?

Satvika
సినీ ఇండస్ట్రీ లో విడాకులు తీసుకొనే వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఒక్క తెలుగు లోనే కాదు. హిందీ,తమిళ్ లో కూడా చాలా మంది సినీ తారలు విడాకులు తిసుకున్నారు. ఈ తంతు కొనసాగుతుంది.ఐదారు నెలల్లోనే ఎంతో మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. కొద్ది నెలల క్రితమే అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారు. ఈ విషయం విన్న వాళ్ళు అభిమానులు షాక్ లో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు కూడా విడాకులు తీసుకుంటూన్నారు..అనే వార్త షికారు చెస్తుంది..జంట మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా కళ్యాణ్ నటించిన సూపర్‌మచ్చి సినిమాను అసలు మెగా హీరోలు ఎవరు ప్రమోట్ చేయలేరు. అంతేకాదు శ్రీజ ఇటీవల ఆమె సోషల్ మీడియా ఖాతా నుంచి కళ్యాణ్ అనే పేరును కూడా తొలగించింది. దాంతో అందరు అదే ఆలోచనలో వున్నారు. మొత్తానికి ఈ విషయం పై పెద్ద చర్చలు జరుగుతున్నాయి.

సమంత కూడా విడాకులు తీసుకొవదానికి ముందు ఇలానే పేరు తీసింది.. ఇప్పుడు చిరంజీవి కూతురు కూడా ఇలానే చేయడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ విషయం పై తాజాగా కళ్యాణ్ దేవ్ స్పందించారు.ఇండస్ట్రీలోని తన సన్నిహితుల వద్ద రెండు రోజుల క్రితం స్పందించడంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలకు. మీడియాకు దూరంగా ఉంటానని అయితే మీడియా మాత్రం కావాలని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తమ కుటుంబం మధ్య జరిగే వ్యక్తిగత విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదు.అని కళ్యాణ్ వాపొయారు.. అసలు విషయం మాత్రం కళ్యాణ్ చెప్పలేదు అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: