వీడియో చూస్తే.. సాయి పల్లవికి హాట్సాఫ్ అంటారు?

praveen
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది సాయి పల్లవి. ఏది పడితే అది చేయడం కాదు కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. అందుకే ఏదైనా సినిమాలో నటిస్తోంది అంటే చాలు ఆ పాత్ర ఎంతో గొప్పగా ఉండబోతుంది అని ప్రతి ప్రేక్షకుడు భావిస్తూ ఉంటాడు. అంతలా తన నటనతో పాత్రల ఎంపిక తో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది సాయిపల్లవి.

 నేటి రోజుల్లో అందాల ఆరబోత చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అందరు హీరోయిన్లు భారీ రెమ్యూనరేషన్ అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం రెమ్యునిరేషన్  విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం తనలో ఉన్న నటిని మాత్రమే ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమైంది. అందుకే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు. సాంప్రదాయమైన వస్త్రధారణలో కనిపిస్తూ తన చిరునవ్వుతోనే అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈమె హీరోయిన్ ఏంటి అనే స్థాయి నుంచి హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే స్థాయికి ఎదిగింది.

 ఇకపోతే ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసింది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించి తన నటనతో మెప్పించింది  సాయి పల్లవి. సినిమా చివర్లో సాయిపల్లవి వృద్ధురాలి పాత్రలో నటించాల్సి ఉంటుంది. ఇక ఈ పాత్ర కోసం చాలా కష్ట పడినట్లు తెలుస్తుంది. సాయి పల్లవి ని వృద్ధురాలు పాత్రలో చూపించేందుకు ఏకంగా గంటలతరబడీ మేకప్ వేశారు అన్నది తెలుస్తుంది. ఈ మేకప్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత సాయి పల్లవి డెడికేషన్ కి అందరూ వాట్సాప్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: