ఈ ఏడాది రవితేజ ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నాడో తెలుసా..?

P.Nishanth Kumar
మాస్ రాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ ఇతర హీరోలకు సమానంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరు హీరోలు కూడా ఒకేసారి మూడుకు పైగా సినిమాల్లో నటిస్తుండడం విశేషం. ఆ చిత్రాల విడుదల సంగతి పక్కన పెడితే ముందుగా అనౌన్స్ చేసి వాటిని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అలా రవితేజ కూడా ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తూ ఉండటం ఆయన అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న ఖిలాడి సినిమాను విడుదల చేసే పనిలో ఉన్న రవితేజ దీని తర్వాత ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఖీలాడి చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ కీలక పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మరొక ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నాడు.  ఆ విధంగా ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన రాబోతోండగా ఈ సినిమా ఎంతటి విజయం నమోదు చేస్తుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అవుతుందో లేదో ఆ తర్వాత నెలలోనే రామారావు డ్యూటీ అనే చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు రవితేజ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంత త్వరగా పూర్తి చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం లోని ధమాకా సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేశాడు  ఇక ఆయన ఇటీవలే మొదలుపెట్టిన రావణాసుర చిత్రాన్ని సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమాకు రాగా రవితేజ చిరంజీవి హీరో గా చేస్తున్న  సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: