ప్రభాస్ తో విజయ్ దేవరకొండ కు పోటీ తప్పదా..!!

P.Nishanth Kumar
పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత ప్రభాస్ రేంజ్ చాలా మారిపోయింది అని చెప్పాలి. బాహుబలి సినిమా ఆయనను ఎప్పుడైతే వరించిందో అప్పుడే ఆయనకు మహర్దశ మొదలైంది. ఆ చిత్రం భారీ విజయం సాధించింది అనే విషయాన్ని పక్కన పెడితే ప్రభాస్ కు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఏర్పడేలా చేసింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత విడుదలైన సాహో చిత్రం కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి ప్రభాస్ కు పాన్ ఇండియా మార్కెట్ లో తిరుగు లేదని నిరూపించింది.

ఆ తర్వాత ఏ రేంజ్ లో ప్రభాస్ తన సత్తా చాటుతాడో అనే విషయాన్ని చూడాలని చాలా మంది ఎదురు చూడగా అప్పటి నుంచి ఆయన హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. అలా రాధే శ్యామ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావించగా అది కాస్తా పోస్ట్ ఫోన్ అవ్వడం మరొకసారి అందరికి తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం పక్కనపెడితే ప్రభాస్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూనే తన భవిష్యత్తు సినిమా షూటింగ్ల లో పాల్గొంటున్నాడు.

అలా క్రేజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిను అలరిస్తుందని నమ్మకం వ్యక్తపరుస్తున్నారు యూనిట్. ఈ సినిమాతో బాలీవుడ్ లో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ భారీ మార్కెట్ ఏర్పడిన ప్రభాస్ మరొకసారి  కలెక్షన్ల సునామీ సృష్టిస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతున్న నేపథ్యం లో అదే నెలలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా కూడా విడుదల అవుతుండడం ఎంతో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: