పుష్ప 2 విషయం లో చాలా మారిపోయిన రష్మిక!!

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న హీరోయిన్ లలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ రష్మిక మందన. కన్నడ సినిమా పరిశ్రమ నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో కి వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన ఈ హీరోయిన్ అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది అని చెప్పవచ్చు. దానికి తోడు ఆమెకు పుష్ప సినిమా ద్వారా మంచి ఇమేజ్ రావడం ప్లస్ పాయింట్ అయింది.  ఆమె ఆ సినిమాలో అవకాశం దక్కించుకోవడం గ్రేట్ అనుకుంటే ఆ సినిమా విడుదల అవడం రష్మిక కు సైతం భారీ స్థాయిలో పేరు రావడం ఆమె కెరీర్ కు ఎంతగానో ఉపయోగ పడింది అని చెప్పవచ్చు. 

అలా బాలీవుడ్ లో ఆమె చేస్తున్న సినిమాలతో ఎంట్రీ ఇవ్వక ముందే పుష్ప సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడం రష్మిక కు ఎంతో ఉపయోగపడింది. ఇక పుష్ప రెండవ భాగం సినిమా  తో ఆమె ఎంతటి స్థాయి క్రేజ్ను అందుకుంటుందో చూడాలి. అయితే పుష్ప మొదటి భాగం ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో రెండవ భాగం సినిమాతో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కు భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుందట హీరోయిన్. పుష్ప సినిమా కి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట.

సక్సెస్ ఉంటే ఎవరైనా ఇంతే కాబట్టి రష్మిక కు అంత ఇవ్వడంలో ఏమాత్రం సందేహించడం లేదట ఆ చిత్ర నిర్మాతలు. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ పేరు ప్రఖ్యాతలు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది అని చెప్పవచ్చు. ఇంత గొప్ప సినిమాను డైరెక్ట్ చేసిన సుకుమార్ ను తనతో సినిమా చేయవలసిందిగా బాలీవుడ్ హీరోలు సైతం రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడని కమిట్మెంట్ ఇవ్వడం పట్ల ఎవరికి కూడా స్పందించలేక పోతున్నాడు. మరి భవిష్యత్తులో ఆయన ఏయే హీరోలతో సినిమాలు చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: