రష్మిక ను దెబ్బెస్తున్న కృతి శెట్టి!!

P.Nishanth Kumar
ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్ ల టాప్ పోజిషన్ అనేది ఏడాది ఏడాదికి మారిపోతూ ఉంటుంది. నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ రెండవ స్థానానికి పడిపోవడం మూడవ స్థానానికి పడిపోవడం జరగడం సహజం. వారు ఏ స్థానం లో ఉంటారు అనేది వారి సక్సెస్ ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే రష్మిక మందన అనే చెప్పాలి. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా భారీ సినిమాలు కాగా అవి పెద్ద హీరో సినిమాలే చేస్తూ ఉండటం ఆమెకు భారీగా డిమాండ్ ఏర్పడడానికి కారణం.

ఆమె ఇటీవల చేసిన పుష్ప సినిమా కూడా సూపర్ హిట్ కావడం దానిలో ఆమె నటనకు కూడా భారీ స్థాయిలో గుర్తింపు రావడంతో మరొక ఐదారేళ్లు రష్మిక మందన కు ఎదురు లేదు అని అందరూ అనుకున్నారు. కానీ కృతి శెట్టి రూపంలో ఆమెకు ఇప్పుడు భారీ ప్రమాదం ఏర్పడింది అని తెలుస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై అందరి హృదయాలను కొల్లగొట్టిన కృతి శెట్టి వరుసగా చేసిన మూడవ సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసింది. దానితో గోల్డెన్ లెగ్ గా ఆమెను అందరూ అభి వర్ణిస్తుండగా ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి పెద్ద హీరోలు సైతం ఇప్పుడు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రష్మిక మందనను తమ సినిమాలలో పెట్టుకోవాలని ఇప్పటికే భవించగా ఇప్పుడు కొంతమంది ఆమెకు బదులుగా కృతి నీ పెట్టుకోవాలని భావిస్తున్నారట.  ఒక్క సినిమా కనుక పెద్ద హీరో తో పడితే ఆమె ప్రభావం తప్పకుండా ఆమెపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా రష్మిక మందన ఆచితూచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుని సక్సెస్ లు సాధించుకోక పొతే ఆమె స్థానాన్ని కృతి భర్తీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవలే బంగార్రాజు చిత్రం తో సక్సెస్ ను కొట్టి హ్యాట్రిక్ విజయాలను సాధించిన ఈ ముద్దుగుమ్మ భవిష్యత్తులో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది.  ఈ నేపథ్యంలో ఈమె స్థాయి నెంబర్ వన్ స్థానానికి ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: