ఇప్పట్లో కృతి శెట్టి స్పీడ్ ను ఆపడం కష్టమేనా..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు, కానీ వారిలో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటారు, కానీ అలా మొదటి సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న వారికి ఆ తరవాత సినిమాలు మాత్రం ఆశించిన రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో  ఇండస్ట్రీలో పెద్దగా ప్రభావం చూపలేక పోతారు. కానీ మొదటి సినిమా మాత్రమే కాకుండా ఆ తర్వాత సినిమాలతో కూడా అదిరిపోయే విజయాలను అందుకుంటూ కొంతమంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. 

 ఇలా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా పోయిన సంవత్సరం మంచి విజయాన్ని అందుకుంది, అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకుంది, ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ లాంగ్వేజ్ లలో విడుదల కాబోతుంది,  ఇలా ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మూడు విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ నటించే తదుపరి సినిమాలతో కూడా విజయాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, అది మాత్రమే కాకుండా ఈ సినిమాలు కూడా  విజయాలను సాధించినట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి స్పీడ్ ను ఆపడం కష్టమే అని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: