పండగను బాగా క్యాష్ చేసుకున్న బంగార్రాజు... కానీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు, సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడం, అలాగే ఈ సినిమాకి పోటీగా పెద్ద స్టార్ హీరో సినిమాలు అవి లేకపోవడంతో బంగార్రాజు సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకుండా పోయింది, బంగార్రాజు మూవీ మొదటి మూడు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇలా సంక్రాంతి సీజన్ కు ఏ స్టార్ హీరో సినిమా లేకపోవడం, అలాగే బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, మరియు ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటించడం ఇలా అనేక అంశాలు ఈ సినిమాకు కలిసి రావడంతో బంగార్రాజు సినిమా ఫుల్ గా కలెక్షన్ లను సాధిస్తుంది. ఇది ఇలా ఉంటే అధిక వసూళ్ళు తెచ్చిపెట్టిన ఏపీలో ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో  బంగార్రాజు సినిమాకు కలెక్షన్ లు ఏరేంజ్ లో ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. బంగార్రాజు మూవీని సోషియో ఫాంటసీ ఔట్ అండ్ ఔట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. బంగార్రాజు సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: