పెద్ద ట్విస్టే ఇది : బంగార్రాజు సీక్వెల్ కూడా రానుందా ... ??

GVK Writings
కింగ్ అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. నాగార్జున కి జోడీగా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమాని కళ్యాణ్ కృష్ణ తీశారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 అయిన బంగార్రాజు కూడా తెరకెక్కి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున తో పాటు అక్కినేని నాగ చైనత్య కూడా కీలక పాత్ర చేసిన బంగార్రాజులో రమ్యకృష్ణ తో పాటు ఉప్పెన నటి కృతి శెట్టి కూడా నటించారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది. మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా దర్శకడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒకరిని మించేలా మరొకరు ఎంతో పోటీ పడి అద్భుతంగా యాక్ట్ చేసారని, అలానే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగుతుందని పలువురు ప్రేక్షకాభిమానులు బంగార్రాజు గురించి పాజిటివ్ గా అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా అన్ని ఏరియాల్లో కూడ ప్రస్తుతం కలెక్షన్స్ దుమ్ము దులుపుతూ నిజమైన సంక్రాంతి విన్నర్ గా నిలిచిన బంగార్రాజుకి త్వరలో సీక్వెల్ రూపొందనుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఇటీవల బంగార్రాజు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బంగార్రాజు కి సీక్వెల్ ఉండే అవకాశం కూడా లేకపోలేదని చిన్న హింట్ ఇచ్చారు. కాగా అది నిజమే అని, త్వరలో తన తదుపరి సినిమా చేసిన అనంతరం ఆపైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజు సీక్వెల్ కథని సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం అక్కినేని హీరోల నుండి బంగార్రాజు సీక్వెల్ రూపంలో మరొక సూపర్ హిట్ ని చూడవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: